అప్పట్లో గాలి శీను... ఇప్పుడు బచ్చలమల్లి

ABN , Publish Date - Dec 18 , 2024 | 02:32 AM

‘‘నాంది’ తర్వాత ఓ విభిన్న చిత్రం చేయాలనుకున్నాను. కథ కోసం ఎదురుచూస్తున్న సమయంలో దర్శకుడు సుబ్బు మంగాదేవి ఈ సినిమా కథను వినిపించాడు. సింగిల్‌ సిట్టింగ్‌లోనే...

‘‘నాంది’ తర్వాత ఓ విభిన్న చిత్రం చేయాలనుకున్నాను. కథ కోసం ఎదురుచూస్తున్న సమయంలో దర్శకుడు సుబ్బు మంగాదేవి ఈ సినిమా కథను వినిపించాడు. సింగిల్‌ సిట్టింగ్‌లోనే సినిమా చేసేందుకు అంగీకరించాను. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలతో పోల్చితే ‘బచ్చలమల్లి’ చాలా వైవిధ్యం ఉన్న పాత్ర. ఒక్క హాస్యం తప్ప మిగిలిన అన్ని ఎమోషన్స్‌ని ఈ పాత్ర పలికిస్తుంది’’ అని అల్లరి నరేశ్‌ అన్నారు. ఆయన కథానాయకుడిగా సుబ్బు దర్శకత్వంలో రాజేశ్‌ దండా నిర్మించిన చిత్రమిది. ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అల్లరి నరేశ్‌ సినిమా విశేషాలను మీడియాతో పంచుకుంటూ..‘ ‘గమ్యం’లో గాలి శీను పాత్ర ప్రేక్షకులను అలరించినట్లే, ఈ ‘బచ్చలమల్లి’ పాత్ర కూడా ప్రేక్షకులపై చాలా ప్రభావం చూపిస్తుంది. నా కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటకొచ్చి కొత్తగా ప్రయత్నించాను. ‘బచ్చలమల్లి’ అనే వ్యక్తి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల స్ఫూర్తితో దర్శకుడు ఈ కథ రాసుకున్నారు. ఆ పాత్రను చేసే క్రమంలో నటుడిగా చాలా సవాళ్లు ఎదురయ్యాయి.


నడక, ఏడ్చే విధానం, మాట్లాడే తీరు... ఇలా ప్రతిదీ సరికొత్తగా ఉండేలా ప్రయత్నించాను. ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో పొగరుతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనే పాయింట్‌ చుట్టూ అల్లుకున్న కథ ఇది. కథలో అంతర్లీనంగా మంచి సందేశం ఉంది. అమృత అయ్యర్‌ పాత్రకు చాలా పేరొస్తుంది. పాత్రల భావోద్వేగాలను ప్రేక్షకులు అనుభూతి చెందేలా విశాల్‌ చంద్రశేఖర్‌ మంచి సంగీతం అందించారు. నిర్మాత రాజేశ్‌ కూడా కథతో ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యారు’ అని అన్నారు.

Updated Date - Dec 18 , 2024 | 02:32 AM