సమాజం కోసం సూపర్‌ హీరోగా...

ABN , Publish Date - Oct 27 , 2024 | 05:49 AM

‘లక్కీ’ ఫేమ్‌ డాక్టర్‌ సూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘బఘీరా’. ‘ఉగ్రమ్‌’ ఫేమ్‌ శ్రీ మురళీ, ప్రకాశ్‌రాజ్‌, రుక్మిణీ వసంత్‌ కీలక పాత్రలు పోషించారు. ప్రశాంత్‌ నీల్‌ కథ అందించారు. విజయ్‌ కిరగందూర్‌ నిర్మించారు....

‘లక్కీ’ ఫేమ్‌ డాక్టర్‌ సూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘బఘీరా’. ‘ఉగ్రమ్‌’ ఫేమ్‌ శ్రీ మురళీ, ప్రకాశ్‌రాజ్‌, రుక్మిణీ వసంత్‌ కీలక పాత్రలు పోషించారు. ప్రశాంత్‌ నీల్‌ కథ అందించారు. విజయ్‌ కిరగందూర్‌ నిర్మించారు. ఈ నెల 31న సినిమా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు సూరి మీడియాతో ముచ్చటించారు. ‘‘కేజీఎఫ్‌’ షూటింగ్‌ టైమ్‌లో శ్రీమురళి కోసం ప్రశాంత్‌ నీల్‌ ఈ కథ చెప్పారు. కథ నచ్చడంతో డెవలప్‌ చేశాను. ఓ సాధారణ వ్యక్తి.. సమాజం కోసం సూపర్‌ హీరోగా మారాడనేది ఈ సినిమా కథాంశం. ఈ సినిమాలోని ప్రతీ సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని పంచే చిత్రమిది. ఇందులో ప్రతీ పాత్రా కీలకమే. సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. అజనీష్‌ లోకనాథం ఇచ్చిన సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. సినిమా ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుంది’’ అని చెప్పారు.

Updated Date - Oct 27 , 2024 | 05:49 AM