Babu: అర్జున్ కళ్యాణ్ ‘బాబు’.. విడుదలకు రెడీ

ABN , Publish Date - Jan 20 , 2024 | 10:06 PM

అర్జున్ కళ్యాణ్ హీరోగా, కుషిత కల్లాపు హీరోయిన్‌గా రాబోతోన్న చిత్రం ‘బాబు’. ట్యాగ్ లైన్ ‘నెంబర్ వన్ బుల్ షిట్ గై’. డీడీ క్రియేషన్స్ బ్యానర్‌పై దండు దిలీప్ కుమార్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎల్ఆర్ (లక్ష్మణ్ వర్మ) ఈ సినిమాకు దర్శకుడు. విలాసం కన్నా అవసరం గొప్పది అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కించారు. ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు సిద్ధం చేస్తున్నట్లుగా మేకర్స్ తెలిపారు.

Babu: అర్జున్ కళ్యాణ్ ‘బాబు’.. విడుదలకు రెడీ
Babu Movie Poster

అర్జున్ కళ్యాణ్ హీరోగా, కుషిత కల్లాపు హీరోయిన్‌గా రాబోతోన్న చిత్రం ‘బాబు’ (Babu). ట్యాగ్ లైన్ ‘నెంబర్ వన్ బుల్ షిట్ గై’. డీడీ క్రియేషన్స్ బ్యానర్‌పై దండు దిలీప్ కుమార్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎల్ఆర్ (లక్ష్మణ్ వర్మ) ఈ సినిమాకు దర్శకుడు. విలాసం కన్నా అవసరం గొప్పది అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కించారు. ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉండబోతోందని మేకర్స్ చెబుతున్నారు. తాజాగా ఈ చిత్ర అప్‌డేట్‌ని మేకర్స్ తెలియజేశారు. (Babu Movie Ready To Release)


ప్రస్తుతం ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుందని.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని మేకర్స్ తెలిపారు. ఇప్పటికే వదిలిన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన వచ్చిందని, ఇక మున్ముందు మరింతగా ప్రమోషనల్ కార్యక్రమాలను పెంచనున్నట్లుగా వారు చెప్పుకొచ్చారు. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో అర్జున్ కళ్యాణ్, కుషిత కల్లాపు, ఎంఎల్ఆర్, సోనాలి, మురళీధర్ గౌడ్, భద్రం, జబర్దస్త్ అప్పారావు, రవి వర్మ, సునిత మనోహర్, అశోక్ వర్దన్, భద్రి జార్జి తదితరులు నటిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Rashmika Mandanna: రష్మిక డీప్‌ ఫేక్ వీడియో.. ఏపీ వ్యక్తి అరెస్ట్

****************************

*Mohan Babu: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం వచ్చింది కానీ..?

****************************

*Varun Tej: మెగా ప్రిన్స్ బర్త్‌డే స్పెషల్‌గా వదిలిన ‘మట్కా’ ఓపెనింగ్ బ్రాకెట్.. ఎలా ఉందంటే?

**************************

*Hansika: 34 నిమిషాల షాట్‌ని సింగిల్ టేక్‌లో..

***************************

Updated Date - Jan 20 , 2024 | 10:06 PM