క్షమాపణ చెబుతా

ABN , Publish Date - Oct 29 , 2024 | 01:59 AM

పొట్టేల్‌’ చిత్రం సక్సెస్‌ మీట్‌లో సినిమా రివ్యూల మీద, రివ్యూ రైటర్స్‌ మీద చౌకబారు వ్యాఖ్యలు చేసిన నటుడు శ్రీకాంత్‌ అయ్యంగార్‌ సోమవారం స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు..

పొట్టేల్‌’ చిత్రం సక్సెస్‌ మీట్‌లో సినిమా రివ్యూల మీద, రివ్యూ రైటర్స్‌ మీద చౌకబారు వ్యాఖ్యలు చేసిన నటుడు శ్రీకాంత్‌ అయ్యంగార్‌ సోమవారం స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. సినిమా ఎలా తీయాలో తెలియని వారంతా రివ్యూలు రాస్తున్నారని, సినిమా సమీక్షలు ఆపేయ్యాలని అంటూ ఆ వేదికపై మాట్లాడి బాధ కలిగించినందుకు శ్రీకాంత్‌ అయ్యంగార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే అందరికీ బేషరతుగా క్షమాపణలు చెబుతానని ఆని ఆయన ఆ వీడియోలో పేర్కొన్నారు.

Updated Date - Oct 29 , 2024 | 01:59 AM