Polimera sequel: త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానున్న 'పొలిమేర 3'

ABN , Publish Date - Jul 10 , 2024 | 10:23 AM

బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో వచ్చిన 'పొలిమేర' సినిమా ఓటిటీలో విడుదలై విజయం సాధిస్తే, దానికి సీక్వెల్ గా వచ్చిన 'పొలిమేర 2' థియేటర్స్ లో విడుదలై సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమాకి మూడో సీక్వల్ గా 'పొలిమేర 3' రాబోతోంది

Polimera 3 is announced

హర్రర్ సినిమా 'పొలిమేర' ఓటిటి లో విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. అనిల్ విశ్వనాధ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, గెటప్ శీను లాంటి నటులు నటించిన విషయం కూడా తెలిసిందే. ఓటిటిలో విజయం తరువాత ఈ సినిమాకి సీక్వెల్ గా 'పొలిమేర 2' థియేటర్స్ లో విడుదల చేశారు. మొదటి రెండు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవటం, ఇక్కడ ఘన విజయం సాధించటంతో ఇప్పుడు ఈ సినిమాకి ఇంకో సీక్వెల్ తయారవుతోంది. (Third sequel to Polimera is announced and the shoot begins soon)

polimera3starts.jpg

అనిల్ విశ్వనాధ్ దర్శకత్వంలో 'పొలిమేర 3' త్వరలోనే ప్రారంభం కానుంది అని అధికారికంగా సామాజిక మాధ్యమం 'ఎక్స్' లో ప్రకటించారు. డిస్ట్రిబ్యూటర్ వంశి నందిపాటి ఈ 'పొలిమేర 3' తో నిర్మాతగా మారుతున్నారు. స్క్రిప్ట్ పని అంతా అయిపోయిందని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ జరుపు కుటుందని తెలుస్తోంది. (Distributor Vamsi Nandipati is turned producer with this third sequel of Polimera 3)

kamakshipolimera.jpg

'పొలిమేర', 'పొలిమేర 2' లో నటించిన సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల లు ఈ 'పొలిమేర 3' లో కూడా కంటిన్యూ అవుతారు. వీళ్ళతో పాటుగా బాలాదిత్య, గెటప్ శీను, రాకేందు మౌళి కూడా ఇందులో నటిస్తున్నారని తెలిసింది. వీళ్ళే కాకుండా ఇంకా కొంతమంది నటీనటులు ఉంటారని తెలుస్తోంది. 'పొలిమేర' సినిమాకి నిర్మాతగా వున్న భోగేంద్ర గుప్త ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్ గా ఉంటారని తెలిసింది. బ్లాక్ మేజిక్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా విజయవంతం అయింది.

Updated Date - Jul 10 , 2024 | 10:33 AM