నిరుద్యోగి ప్రేమకథ
ABN , Publish Date - Aug 28 , 2024 | 02:31 AM
విప్లవ్ ప్రధాన పాత్ర పోషిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఈసారైనా’. ఉద్యోగం కోసం వెదుక్కుంటున్న ఓ యువకుడు ప్రేమలో పడడం, చివరకు ఉద్యోగాన్ని...
విప్లవ్ ప్రధాన పాత్ర పోషిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఈసారైనా’. ఉద్యోగం కోసం వెదుక్కుంటున్న ఓ యువకుడు ప్రేమలో పడడం, చివరకు ఉద్యోగాన్ని పొందాడా, ప్రేమలో విజయం సాధించాడా అనేది ఆసక్తికరమని దర్శకుడు విప్లవ్ చెప్పారు. గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో అశ్విని అయలూరు హీరోయిన్. సంకీర్త్ కొండ సహ నిర్మాత.