మహేశ్ సినిమా పేరు అదేనా?
ABN , Publish Date - Aug 24 , 2024 | 06:51 AM
మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో డా.కె.ఎల్.నారాయణ నిర్మించే చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేశ్ పుట్టినరోజున సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వస్తుందని ఆశగా ఎదురు చూసిన ఆయన అభిమానులు ఏదీ రాకపోవడంతో నిరాశకు గురయ్యారు.
మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో డా.కె.ఎల్.నారాయణ నిర్మించే చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేశ్ పుట్టినరోజున సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వస్తుందని ఆశగా ఎదురు చూసిన ఆయన అభిమానులు ఏదీ రాకపోవడంతో నిరాశకు గురయ్యారు. యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ సినిమా ఉంటుందన్న సమాచారం తప్ప కొత్త వార్తలేమీ బయటకు రావడం లేదు. సినిమా టీమ్ మాత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో సీరియ్‌సగా నిమగ్నమై ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. విజువల్ డెవల్‌పమెంట్ ఆర్టిస్ట్ టీపీ విజయన్ తన ఇన్‌స్టా స్టోరీ్‌సలో బంగారు వర్ణంలో ఉన్న గద్ద రెక్కలు ఉంచి మహేశ్ సినిమా టైటిల్ ఇదే అని అర్థం వచ్చేలా పోస్ట్ చేయడంతో అభిమానుల్లో చర్చ మొదలైంది. ఈ సినిమాకు ‘గరుడ’ అనే టైటిల్ పెట్టవచ్చు అనే ఊహాగానాలు ఊపందుకొన్నాయి. గతంలో దర్శకుడు రాజమౌళి ‘బాహుబలి’ తర్వాత తను చేయబోయే ప్రాజెక్ట్ ‘గరుడ’ అని వెల్లడించారు. ఆ ప్రాజెక్ట్ ఇదే అయి ఉంటుందని, సినిమాకు ‘గరుడ’ అని పేరు పెడతారని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. మహేశ్ చిత్రానికి ‘గరుడ’ టైటిల్ ఖాయమో కాదో అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.