అమ్మనవ్వాలని నాకూ ఉంది
ABN , Publish Date - Nov 11 , 2024 | 03:14 AM
సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘సీటాడెల్: హనీబన్నీ’ వెబ్‌సిరీస్ ఇటీవలే విడుదలై ప్రేక్షకాధరణ పొందిన విషయం తెలిసిందే. ఆ సిరీ్‌సలో సమంత తన బిడ్డను కాపాడుకునేందుకు అరాచక శక్తులతో పోరాడే శక్తిమంతమైన తల్లిపాత్రలో ఆకట్టుకున్నారు...
సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘సీటాడెల్: హనీబన్నీ’ వెబ్‌సిరీస్ ఇటీవలే విడుదలై ప్రేక్షకాధరణ పొందిన విషయం తెలిసిందే. ఆ సిరీ్‌సలో సమంత తన బిడ్డను కాపాడుకునేందుకు అరాచక శక్తులతో పోరాడే శక్తిమంతమైన తల్లిపాత్రలో ఆకట్టుకున్నారు. ఆ సిరీ్‌సలో తను పోషించిన తల్లి పాత్ర గురించి సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘తెరపైనే కాదు నిజ జీవితంలోనూ అమ్మగా పిల్లల ఆలనా పాలనా చూసి మురిసిపోవాలనుంద’ని ఆమె తన మనసులో మాట చెప్పారు. ‘పిల్లలతో గడపడం నాకు చాలా ఇష్టమైన విషయం. మాతృత్వాన్ని ఆస్వాదించే విషయంలో నాకంటూ కొన్ని కలలు ఉన్నాయి. తల్లినవ్వాలని నాకూ ఉంది. పిల్లలను ప్రేమ ఆప్యాయతలతో పెంచాలనే కోరిక ఉంది. అయితే అమ్మనయ్యే విషయంలో ఇప్పటికే ఆలస్యం అయిందని నేను అనుకోవడం లేదు’ అని సమంత అన్నారు. మయోసైటిస్ వ్యాధి పూర్తిగా నయం కాకపోయినా చాలా వరకూ కోలుకున్నట్లు సమంత చెప్పారు.