AN63: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో అల్లరి నరేష్ చిత్రం.. అనౌన్స్ చేసేశారు

ABN , Publish Date - Jun 30 , 2024 | 05:16 PM

కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న అల్లరి నరేష్.. ఈ మధ్య విభిన్న చిత్రాలు, పాత్రలతో గొప్ప నటుడిగానూ పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు నరేష్ మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి రెడీ అవుతున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా AN63 పేరుతో సినిమాను అనౌన్స్ చేశారు.

AN63: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో అల్లరి నరేష్ చిత్రం.. అనౌన్స్ చేసేశారు
AN63 Announcement Poster

కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న అల్లరి నరేష్ (Allari Naresh).. ఈ మధ్య విభిన్న చిత్రాలు, పాత్రలతో గొప్ప నటుడిగానూ పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు నరేష్ మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి రెడీ అవుతున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments) ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 30న ‘మీరు అతని కంటి నుండి తప్పించుకోలేరు’ అంటూ విలక్షణమైన కాన్సెప్ట్ పోస్టర్‌తో సితార సంస్థ ఈ చిత్ర ప్రకటన చేసింది. (HBD Allari Naresh)

సంకేత భాషతో రూపొందించిన ఈ పోస్టర్ ఎంతో సృజనాత్మకంగా ఉంది. ఒక్క పోస్టర్‌తోనే విభిన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉండబోతుందనే విషయాన్ని మేకర్స్ స్పష్టం చేశారు. ఈ సృజనాత్మక పోస్టర్ సినీ ప్రేమికులలో మరియు అల్లరి నరేష్ అభిమానులలో ఆసక్తిని రేపుతోంది. సంకేత భాషలో దాచిన సందేశాన్ని డీకోడ్ చేయడానికి అందరూ ప్రయత్నిస్తుండటం విశేషం. అల్లరి నరేష్ యొక్క 63వ (AN63) చిత్రంగా రానున్న ఈ సినిమా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.29 గా రూపొందనుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. (AN63 Announcement Poster)


Allari-Naresh.jpg

అల్లరి నరేష్ ఇటీవలి కాలంలో వైవిధ్యమైన, కొత్త కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తూ నటుడిగా రోజురోజుకూ తన పరిణితిని ప్రదర్శిస్తున్నారు. ఇక ఇప్పుడు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో చేయబోతోన్న ఈ సినిమా కేవలం ప్రకటనతోనే అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. ‘ఫ్యామిలీ డ్రామా’ చిత్రంతో ప్రశంసలు పొందిన రచయిత-దర్శకుడు మెహర్ తేజ్ (Meher Tej) ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం వహిస్తున్నారు. నూతన కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించి, ఘన విజయం సాధిస్తుందని నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

Updated Date - Jun 30 , 2024 | 05:16 PM