Akira Nandan: నాన్న కోసం.. అకీరా నందన్ టాలెంట్‌కు అంతా ఫిదా!

ABN , Publish Date - Jun 06 , 2024 | 11:34 AM

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికలలో జనసేన పార్టీ 100 పర్సంట్ సక్సెస్ రేట్‌తో అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలలో ఘన విజయం సాధించిన దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డును జనసేన పార్టీ లిఖించింది. ఈ సంతోష సమయంలో పవన్ తనయుడు అకీరా నందన్ తన తండ్రి జర్నీపై చేసిన వీడియో ఒకటి.. అందరినీ ఆకర్షిస్తోంది.

Akira Nandan: నాన్న కోసం.. అకీరా నందన్ టాలెంట్‌కు అంతా ఫిదా!
Akira Nandan and Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికలలో (AP Elections 2024) జనసేన పార్టీ (Janasena Party) 100 పర్సంట్ సక్సెస్ రేట్‌తో అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలలో ఘన విజయం సాధించిన దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డును జనసేన పార్టీ లిఖించింది. తన పార్టీని గెలిపించుకోవడంతో పాటు, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), టీడీపీ ఇతర నేతలు, బీజేపీ (BJP) నేతల విజయంలోనూ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కీలక పాత్ర పోషించినట్లుగా ఇప్పుడంతా ఆయనను కొనియాడుతున్నారు. ఈ సంతోష సమయంలో పవన్ తనయుడు అకీరా నందన్ (Akira Nandan) తన తండ్రి జర్నీపై చేసిన వీడియో ఒకటి.. అందరినీ ఆకర్షిస్తోంది.

Also Read- Pawan Kalyan: పవర్ స్టార్ నిజజీవితంలో కూడా పవర్ ఫుల్, హోమ్ మినిస్టర్?


‘‘అకీరా నాకు కాల్ చేసి నాన్న గురించి చేసిన ఈ వీడియోని షేర్ చేయమని చెప్పాడు. నాన్న కోసం కొన్ని వారాల క్రితమే అకీరా ఈ వీడియోని ఎడిట్ చేశాడు. తన తండ్రి సాధించిన విజయం పట్ల ఎంతో ఆనందంగా, గర్వంగా ఉన్నాడు అకీరా’’ అని తెలుపుతూ పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ (Renu Desai) షేర్ చేసిన ఈ వీడియోలో.. పవన్ కళ్యాణ్ జర్నీని (Pawan Kalyan Journey) ఎంతో చక్కగా అకీరా ఎడిట్ చేయడం విశేషం. ఈ వీడియోపై సినీ సెలబ్రిటీలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అద్భుతం అకీరా అంటూ అకీరాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.


Pawan-Akira.jpg

‘ఇల్లేమో దూరం.. అసలే చీకటి, గాడాంధకారం.. దారంతా గతుకులు.. చేతిలో దీపం లేదు.. కానీ గుండెల నిండా ధైర్యం ఉంది..’ అంటూ పవన్ కళ్యాణ్ మొదటి పొలిటికల్ సమావేశంలో చెప్పిన డైలాగ్‌తో ఈ వీడియో మొదలైంది. ఆ తర్వాత తమ్ముడు, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, ఖుషి, అత్తారింటికి దారేది, భీమ్లా నాయక్, తీన్‌మార్, గబ్బర్ సింగ్, పంజా, వకీల్ సాబ్, జల్సా సినిమాలలోని పవర్‌ఫుల్ సీన్లు తీసుకొని వీడియోని, బ్యాగ్రౌండ్‌లో మైకెల్ జాక్సన్ ఫేమస్ సాంగ్‌తో అకీరా ఎడిట్ (Akira Edited Video) చేసిన తీరు నిజంగా ఫ్యాన్స్‌కు అయితే గూజ్‌బంప్స్ తెప్పిస్తోంది. అకీరా నందన్ టాలెంట్‌కు మెగాభిమానులే కాకుండా.. నెటిజన్లు ఎందరో ఫిదా అవుతున్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.

Read Latest Cinema News

Updated Date - Jun 06 , 2024 | 11:34 AM