అఖండ తాండవం ఆరంభం
ABN , Publish Date - Oct 17 , 2024 | 05:48 AM
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను హిట్ కాంబినేషన్‌లో నాలుగో చిత్రం మొదలైంది. వీరిద్దరి కలయికలో తెరకెక్కి ఘన విజయం అందుకున్న ‘అఖండ’ చిత్రానికి కొనసాగింపుగా ‘అఖండ 2’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు...
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను హిట్ కాంబినేషన్‌లో నాలుగో చిత్రం మొదలైంది. వీరిద్దరి కలయికలో తెరకెక్కి ఘన విజయం అందుకున్న ‘అఖండ’ చిత్రానికి కొనసాగింపుగా ‘అఖండ 2’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. బుధవారం ఈ చిత్రం షూటింగ్ పూజా కార్యక్రమాలతో మొదలైంది. బాలకృష్ణ పవర్‌ఫుల్ డైలాగ్‌తో మొదలైన ముహూర్తం షాట్‌కు తేజస్విని కెమెరా స్విచాన్ చేయగా, బ్రాహ్మణి క్లాప్ ఇచ్చారు. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ఏం తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా తమన్ నేపథ్య సంగీతంతో రూపొందిన ‘అఖండ 2 తాండవం’ టైటిల్ థీమ్‌ను నందమూరి రామకృష్ణ చేతుల మీదుగా విడుదల చేశారు. శివలింగం, డమరుకం,
హిమాలయాల నేపథ్యంలో రూపొందించిన ‘అఖండ 2’ టైటిల్ పోస్టర్‌ను చూస్తుంటే యాక్షన్ అంశాలతో పాటు మనసును కదిలించే ఆధ్యాత్మిక అంశాలతో రూపొందుతోందని తెలుస్తోంది. రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభిస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సి. రామ్‌ప్రసాద్, సంతోష్ డి డెటాకే, ఆర్ట్ ఏఎస్ ప్రకాశ్, ఎడిటర్: తమ్మిరాజు