Payal Rajput: పాయల్ రాజ్ పూత్ తాజా బోల్డ్ ఫోటోషూట్

ABN , Publish Date - Jun 18 , 2024 | 02:48 PM

నటి పాయల్ రాజ్ పూత్ ఆమధ్య ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. 'రక్షణ' సినిమా విషయంలో తనకి రావాల్సిన బకాయిలు చెల్లించకుండా విడుదల చేస్తున్నారని చిత్ర నిర్వాహకులపై పాయల్ సామజిక మాధ్యమంలో పోస్ట్ పెట్టింది. ఆ చిత్ర నిర్వాహకులు నిర్మాతల మండలి లో పాయల్ పై ఫిర్యాదు చేశారు. ఇలా వివాదాల్లో వున్న పాయల్ ఇప్పుడు ఒక బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ఫోటో షూట్ చేసి పోస్ట్ చేసింది.

Payal Rajput: పాయల్ రాజ్ పూత్ తాజా బోల్డ్ ఫోటోషూట్
Payal Rajput latest photoshoot

పాయల్ రాజ్ పూత్ అప్పుడప్పుడూ వార్తల్లో ఉంటూ వస్తోంది. ఆమధ్య 'రక్షణ' అనే సినిమా ప్రచారాలకు రాలేదని ఆ సినిమా నిర్మాత పాయల్ రాజ్ పూత్ పై తీవ్రంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం పాయల్ 50 రోజులు కేటాయించిందని, 47 రోజులు పని చేసిందని, ఇంకా మూడు రోజులు ప్రచారంలో పాల్గొనాలని ఈ చిత్ర నిర్వాహకులు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలిలో ఆమెపై ఫిర్యాదు చేశారు. (Actress Payal Rajput posted some bold and beautiful photos on her Instagram)

payalrajputnewphotosa.jpg

పాయల్ కూడా తన సామాజిక మాధ్యమంలో ఈ సినిమా నిర్వాహకులు తనకి డబ్బులు ఇంకా ఇవ్వాల్సి ఉందని, చిత్ర పరిశ్రమనుండి తనని బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు. తనకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండానే చిత్రం విడుదల చేస్తున్నారని ఆరోపించారు. నిర్మాతల మండలి పాయల్ ని ఈ చిత్ర నిర్వాహకులతో కుదుర్చుకున్న ఒప్పందం గౌరవించాల్సి ఉందని చెప్పారు. ఈ సంఘటన కొన్ని రోజుల క్రితం వివాదం అయింది. (Payal Rajput bold and beautiful photos)

payalrajputnewphotosb.jpg

పాయల్ చేతిలో ఇప్పుడు కొన్ని సినిమాలు వున్నట్టుగా తెలుస్తోది. తమిళ సినిమాలు రెండు వొప్పుకున్నట్టుగా తెలుస్తోంది, అలాగే ఒక తెలుగు సినిమా కూడా చేస్తున్నట్టుగా వుంది. పాయల్ తెలుగులో 'ఆర్ఎక్స్ 100' అనే సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ తరువాత చాల ఆసినిమాలో నటించినా మొదటి సినిమా ఇచ్చిన విజయం ఏ సినిమా కూడా ఇవ్వలేదు.

payalrajputnewphotos.jpg

పాయల్ అప్పుడప్పుడూ కొంచెం బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తూ తన సామజిక మాధ్యమం అయిన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అభిమానులు ఆమె ఫోటోలపై కామెంట్స్ కూడా పెడుతూ వుంటారు. ఈసారి కూడా ఒక ఆకుపచ్చ అవుట్ ఫిట్ లో బోల్డ్ ఫోటో షూట్ చేయించి ఆ ఫోటోలు పోస్ట్ చేసింది. నేను నవ్వినప్పుడు చాలా బాగుంటాను అనే విధంగా వచ్చే కేప్షన్ కూడా పెట్టింది పాయల్.

Updated Date - Jun 18 , 2024 | 02:49 PM