Just A Minute: మంచి ఫన్ కాన్సెఫ్ట్‌తో ‘జస్ట్ ఏ మినిట్’.. ట్రైలర్ విడుదల
ABN , Publish Date - Jul 13 , 2024 | 09:37 PM
‘ఏడు చేపల కథ’ ద్వారా పరిచయమైన అభిషేక్ పచ్చిపాల హీరోగా నజియా ఖాన్, వినీషా జ్ఞానేశ్వర్ హీరోయిన్లుగా రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్, సుధర్మ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘జస్ట్ ఏ మినిట్’. తన్వీర్ మరియు ప్రకాష్ నిర్మించిన ఈ చిత్రానికి యశ్వంత్ దర్శకుడు. కామెడీ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం గ్రాండ్‌గా విడుదల చేశారు.
‘ఏడు చేపల కథ’ ద్వారా పరిచయమైన అభిషేక్ పచ్చిపాల (Abhishek Pachipala) హీరోగా నజియా ఖాన్, వినీషా జ్ఞానేశ్వర్ హీరోయిన్లుగా రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్, సుధర్మ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘జస్ట్ ఏ మినిట్’ (Just A Minute). తన్వీర్ మరియు ప్రకాష్ నిర్మించిన ఈ చిత్రానికి యశ్వంత్ దర్శకుడు. కామెడీ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈనెల 19న సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ట్రైలర్ విడుదల కార్యక్రమంలో నిర్మాతలు తన్వీర్, ప్రకాష్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి పని చేశాం. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈనెల 19న రిలీజ్ చేస్తున్నాం. ప్రేక్షకులు సినిమా చూసి ఆదరించి మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. (Just A Minute Trailer Released)
హీరో అభిషేక్ పచ్చిపాల మాట్లాడుతూ.. ఈ సినిమా మొత్తం మంచి ఫన్ ఉంటుంది. డైరెక్టర్ అభిషేక్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. మ్యూజిక్ డైరెక్టర్ బాజీ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకి హైలైట్. నిర్మాతలు చాలా బాగా సపోర్ట్ చేశారు. సినిమా ఎవరిని డిజప్పాయింట్ చేయదు. సినిమా హిట్ చేసినా సినిమాలు చేస్తా.. ఫ్లాప్ చేసినా సినిమాలు చేస్తా. ప్రేక్షకులు ఈ సినిమా చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు. దర్శకుడు యశ్వంత్ మాట్లాడుతూ.. నేను ముందు ఈ సినిమాకి కో డైరెక్టర్‌గా వచ్చాను. అనుకోని కారణాలవల్ల నిర్మాత తన్వీర్ నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అభిషేకం ఫణి ఈ కథ వినగానే ఒప్పుకొని నాకు అవకాశాన్ని ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు ఈ సినిమాని చూసి ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్లు నజియా ఖాన్, వినీషా జ్ఞానేశ్వర్, జబర్దస్త్ ఫణి మాట్లాడారు.