Abhinav: పద్మవ్యూహాన్ని చేదించే ‘అభినవ్’.. ట్రైలర్ విడుదల
ABN , Publish Date - Aug 15 , 2024 | 07:20 PM
శ్రీలక్ష్మి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న బాలల చిత్రం ‘అభినవ్’. Chased Padmavyuha అనేది ట్యాగ్‌లైన్. భీమగాని సుధాకర్ గౌడ్ నిర్మాత మరియు దర్శకునిగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఫిల్మ్ ఛాంబర్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ట్రైలర్‌ను ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీలక్ష్మి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న బాలల చిత్రం ‘అభినవ్’. Chased Padmavyuha అనేది ట్యాగ్‌లైన్. భీమగాని సుధాకర్ గౌడ్ (Bheemagani Sudhakar Goud) నిర్మాత మరియు దర్శకునిగా ఈ ‘అభినవ్’ (Abhinav) చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఫిల్మ్ ఛాంబర్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, నిర్మాతల మండలి సెక్రెటరీ ప్రసన్న కుమార్, నిర్మాత దామోదర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ (Bharath Bhushan) విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read- Thangalaan Review: ‘బంగారం’లాంటి సినిమా..
ట్రైలర్ విషయానికి వస్తే.. ‘‘గ్రామీణ ప్రాంతాలలోని హరిజన, గిరిజన విద్యార్థులతో సత్య అనే గంజాయి మాఫియాడాన్ స్మగ్లింగ్ చేయిస్తుంటాడు. బంటి అనే గిరిజన బాలుడు.. ఆ స్మగ్లర్ చేతిలో పావుగా మారి గంజాయి స్మగ్లింగ్ చేస్తుంటాడు. భారతి అనే అభ్యుదయ ఉపాధ్యాయురాలి ద్వారా ప్రేరణ పొందిన అభినవ్, రోహన్, అక్షర మరియు ఇతర బాలబాలికలు ఎన్‌సీసీ మరియు ఆర్మీ శిక్షణ పొందుతుంటారు. ఎన్ఎస్‌ఎస్ ప్రొగ్రాం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళిన గిరిజన విద్యార్థుల స్థితిగతులను గమనించి డ్రగ్ మాఫియాను అంతం చేయడానికి ఆర్మీ తరహా శిక్షణ తీసుకుని గంజాయి మాఫియా డాన్ సత్య ద్వారా బంధింపబడ్డ బాల కార్మికులను విముక్తి చేసి స్మగ్లర్‌గా మారిన బంటిని సత్య తమ్ముడైన విష్ణు మరియు సామాజిక సంఘ సంస్కర్త విజయలక్ష్మి బంటిని మారుస్తారు. నిజం తెలుసుకున్న బంటి తన జీవితాన్ని నాశనం చేసిన సత్యను కాల్చి చంపుతాడు. (Abhinav Trailer Released)
ఈ చిత్రం యొక్క ప్రధాన ఉద్దేశం బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం మరియు గంజాయి మాఫియకు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు బలి కాకుండా మరియు విద్యార్థి దశ నుండే ఎన్‌ఎస్‌ఎస్ మరియు ఎన్‌సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్‌లలో శిక్షణ పొంది దేశ రక్షణలో విద్యార్ధులు కూడా భాగస్వాములు కావాలనేదే. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో సమ్మెట గాంధీ మరియు మాఫియా డాన్‌గా సత్య ఎర్ర, ప్రధాన బాల నటులు మాస్టర్ గగన్, గీతా గోవింద్, అభినవ్, చరణ్, బేబీ అక్షర నటించారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని సారథి స్టూడియో యొక్క సహకారంతో పూర్తి చేయడం జరిగిందని ఈ సందర్భంగా దర్శకనిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్ వెల్లడించారు. అలాగే ట్రైలర్ ఆవిష్కరించిన, అతిథిగా హాజరైన ప్రముఖులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Read Latest Cinema News