Aay: ట్రైలర్ విడుదల పిఠాపురంలో.. ‘ఆయ్’

ABN , Publish Date - Aug 03 , 2024 | 10:26 PM

‘ఆయ్’ చిత్రంతో ప్రేక్ష‌కులు మనసారా ఆనందించేలా చేయడానికి సిద్ధ‌మైంది టాలీవుడ్ ప్రెస్టీజియ‌స్ బ్యాన‌ర్ GA2 పిక్చర్స్. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తోన్న ఈ చిత్రంతో అంజి కె. మ‌ణిపుత్ర‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. పిఠాపురంలో ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్నారు.

Aay Movie Still

కడుపుబ్బా న‌వ్వుకునే కామెడీ సినిమాలు రావ‌టం అరుదుగా మారుతున్న ఈ టైమ్‌లో.. కుటుంబ‌మంతా క‌లిసి న‌వ్వుకునేలా, న‌వ్వుల పండుగ‌ను చేసుకునేలా ఇప్పుడో చిత్రం రాబోతోంది అంటున్నారు ఆ చిత్ర మేకర్స్. ఇంతకీ ఆ చిత్రం ఏదని అనుకుంటున్నారా? ‘ఆయ్’ (Aay). ఈ చిత్రంతో ప్రేక్ష‌కులు మనసారా ఆనందించేలా చేయడానికి సిద్ధ‌మైంది టాలీవుడ్ ప్రెస్టీజియ‌స్ బ్యాన‌ర్ GA2 పిక్చర్స్. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్ (Narne Nithin), నయన్ సారిక (Nayan Sarika) జంటగా నటిస్తోన్న ఈ చిత్రంతో అంజి కె. మ‌ణిపుత్ర‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు.

Also Read- Buddy Movie Review: బడ్డీ మూవీ రివ్యూ

ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ తెరకెక్కిన ‘ఆయ్’ సినిమా స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 15న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌ రిలీజ్‌‌కు సిద్ధమైంది. డిఫ‌రెంట్ ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌తో ఈ సినిమా అందరి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ‘ఆయ్’ సినిమా నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు సూప‌ర్బ్ స్పందనను రాబట్టుకోవడంతో పాటు.. సోష‌ల్ మీడియాలో రీల్స్‌, షార్ట్స్ రూపంలో తెగ వైర‌ల్ అయ్యాయి. దీంతో సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ అంచ‌నాల‌ను మ‌రింత పెంచేలా మేక‌ర్స్ ఆగ‌స్ట్ 5న పిఠాపురం (Pithapuram)లో ‘ఆయ్’ మూవీ ట్రైలర్‌ను విడుద‌ల చేస్తున్నట్లుగా ప్రకటించారు. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న చేస్తూ ఓ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే హీరో నార్నే నితిన్‌, హీరోయిన్ న‌య‌న్ సారిక గోదావ‌రిలో చెరో ప‌డ‌వ‌లో సేద తీరుతూ ప్ర‌కృతిని ఆస్వాదిస్తున్నారు. చిన్న‌పాటి న‌వ్వుల స్నానానికి ఆగ‌స్ట్ 5న అందరూ సిద్ధం కండి అంటూ క్యాప్ష‌న్ ఇవ్వ‌టం ద్వారా మేక‌ర్స్ సినిమా ఎంత‌గా ఎంటర్‌టైన్ చేయబోతుందనే హింట్‌ని ఇచ్చేశారు.


Aay-Movie-Pic.jpg

ప్రమోషన్స్ మొదలైనప్పటి నుంచి ‘ఆయ్‌’కు సంబంధించి రెగ్యుల‌ర్‌గా మూవీ అప్‌డేట్స్‌ను మేకర్స్ ఇస్తూనే ఉన్నారు. గోదావ‌రి బ్యాక్‌డ్రాప్‌తో ‘ఆయ్’ సినిమా రూపొందింది. ఈ ఫ‌న్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌తో నార్నే నితిన్ ప్రేక్ష‌కుల‌కు మరింతగా దగ్గరవుతారని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాకు కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా, సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్‌గా, రామ్ మిర్యాల సంగీత దర్శకుడిగా వర్క్ చేశారు.

Read Latest Cinema News

Updated Date - Aug 03 , 2024 | 10:26 PM