సర్దార్ కోసం ఆషిక
ABN , Publish Date - Aug 06 , 2024 | 04:53 AM
తెలుగు, తమిళ భాషల్లో హిట్ అయిన ‘సర్దార్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘సర్దార్ 2’ చిత్రం ఇప్పుడు తయారవుతోంది. కార్తి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహన్...
తెలుగు, తమిళ భాషల్లో హిట్ అయిన ‘సర్దార్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘సర్దార్ 2’ చిత్రం ఇప్పుడు తయారవుతోంది. కార్తి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహన్ ఒక హీరోయిన్‌గా నటిస్తున్నారు. మరో హీరోయిన్‌గా ఆషికా రంగనాథ్‌ను ఎంపిక చేసినట్లు నిర్మాత ఎస్.లక్ష్మణ్‌కుమార్ చెప్పారు. ఎస్.జె.సూర్య మరో పవర్‌ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలో వేసిన భారీ సెట్‌లో షూటింగ్ జరుగుతున్నట్లు దర్శకుడు పి.ఎ్‌స.మిత్రన్ చెప్పారు.