తుపాన్ లాంటి యాక్షన్
ABN , Publish Date - Aug 01 , 2024 | 04:13 AM
విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ‘తుపాన్’ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో కమల్ బోరా, లలిత, ప్రదీప్, పంకజ్ బోరా నిర్మించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో...
విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ‘తుపాన్’ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో కమల్ బోరా, లలిత, ప్రదీప్, పంకజ్ బోరా నిర్మించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ ఆంటోని మాట్లాడుతూ ‘‘బిచ్చగాడు’ తర్వాత నా మనసుకు దగ్గరైన కథ ఇది. ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. యాక్షన్ ఘట్టాలు ఆకట్టుకుంటాయి. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించాలి’ అని కోరారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం యూనిట్ చాలా కష్టపడింది. విజయ్ ఆంటోని ఇందులో సరికొత్తగా కనిపిస్తారు. వినోదం,యాక్షన్ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’ అని చెప్పారు.