మ్యూజిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేస్తా

ABN, Publish Date - Nov 16 , 2024 | 05:58 AM

సంగీత దర్శకుడు తమన్‌ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. రీసెంట్‌గా ‘పుష్ప-2’ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ పనుల్ని పూర్తి చేశారు. ప్రస్తుతం ‘ఓజీ, రాజాసాబ్‌, గేమ్‌ ఛేంజర్‌, డాకు మహారాజ్‌’ వంటి చిత్రాలతో

- తమన్‌

సంగీత దర్శకుడు తమన్‌ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. రీసెంట్‌గా ‘పుష్ప-2’ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ పనుల్ని పూర్తి చేశారు. ప్రస్తుతం ‘ఓజీ, రాజాసాబ్‌, గేమ్‌ ఛేంజర్‌, డాకు మహారాజ్‌’ వంటి చిత్రాలతో తమన్‌ ఫుల్‌ బిజీగా ఉన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు...

  • ఒకప్పుడు రొటీన్‌ చిత్రాలు వచ్చేవి. కానీ ఇప్పుడు డిఫరెంట్‌ కథలు, రకరకాల కాన్సె్‌ప్టలు వస్తున్నాయి. కాబట్టి డిఫరెంట్‌ మ్యూజిక్‌ ఇస్తున్నాను. ‘తెలుసు కదా’, ‘ఓజీ’, ‘గేమ్‌ ఛేంజర్‌’, ‘డాకు మహారాజ్‌’ ఇలా దేనికవే డిఫరెంట్‌గా ఉన్నాయి.

  • ‘డాకు మహారాజ్‌’ చిత్రంలో మూడు పాటలే ఉంటాయి. ‘గేమ్‌ చేంజర్‌’లో ఏడు పాటలు ఉంటాయి. ఏడు సంవత్సరాల తర్వాత శంకర్‌ ఒక ప్రాపర్‌ కమర్షియల్‌ మూవీ చేస్తున్నారు. 15 రోజుల్లో ‘పుష్ప-2’ సినిమా కంప్లీట్‌ చేయమన్నారు. అది సాధ్యం కాదు. అందుకే నాకున్న టైమ్‌లో ఫస్ట్‌ హాఫ్‌ను దాదాపుగా కంప్లీట్‌ చేశాను.

  • ఏ.ఆర్‌.రెహ్మాన్‌ స్థాయికి వెళ్లాలి అనేది నా కల. ‘బాయ్స్‌’ టైమ్‌లో డైరెక్టర్‌ శంకర్‌ నాలో యాక్టర్‌ని చూశారు. నేను మంచి మ్యూజిక్‌ డైరెక్టర్‌ని అని గుర్తించేందుకు ఇన్నేళ్లు పట్టింది. ఒకప్పుడు మూస ధోరణిలో ఉన్న సినిమాలకు కంటిన్యూగా మ్యూజిక్‌ ఇస్తూ వచ్చాను. ఆ టైమ్‌లో కాపీ క్యాట్‌, కాపీ గోట్‌ అని ట్రోల్‌ చేశారు. మళ్లీ అలాంటి చిత్రాలను సెలెక్ట్‌ చేసుకోవడం లేదు.

  • మ్యూజిక్‌ స్కూల్‌ నిర్మించాలని నా కోరిక. మూడేళ్లలో వరల్డ్‌క్లాస్‌ స్కూల్‌ని హైదరాబాద్‌లో కడతాను. ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉచితంగా సంగీతం నేర్పించాలని అనుకుంటున్నాను. మ్యూజిక్‌ ఉన్న చోట క్రైమ్‌ రేట్‌ తక్కువగా ఉంటుంది. నేను క్రికెట్‌ ఆడి వస్తే... వెంటనే ఓ ట్యూన్‌ వస్తుంది. క్రికెట్‌ ఆడటంలో నాకు చాలా ఆనందం ఉంది.

Updated Date - Nov 16 , 2024 | 05:58 AM