మర్డర్‌ మిస్టరీ-క్రైమ్‌ థ్రిల్లర్‌

ABN , Publish Date - Oct 17 , 2024 | 05:33 AM

మల్టీ టాలెంటెడ్‌ అయిన విజయ్‌ అంటోనీ నటించిన తాజా చిత్రం ‘గగన మార్గన్‌’. విజయ్‌ ఆంటోని ఫిల్మ్స్‌ కార్పొరేషన్‌ బ్యానర్‌పై మీరా విజయ్‌ ఆంటోని నిర్మించారు...

మల్టీ టాలెంటెడ్‌ అయిన విజయ్‌ అంటోనీ నటించిన తాజా చిత్రం ‘గగన మార్గన్‌’. విజయ్‌ ఆంటోని ఫిల్మ్స్‌ కార్పొరేషన్‌ బ్యానర్‌పై మీరా విజయ్‌ ఆంటోని నిర్మించారు. ఎన్నో చిత్రాలకు ఎడిటర్‌గా పని చేసిన లియో జాన్‌ పాల్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కాగా, తాజాగా రిలీజ్‌ చేసిన ఈ చిత్రం టైటిల్‌ పోస్టర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో విజయ్‌ ఆంటోని రెండు రకాలుగా కనిపించారు.

Updated Date - Oct 17 , 2024 | 05:33 AM