విందు భోజనం లాంటి సినిమా
ABN , Publish Date - Feb 06 , 2024 | 12:53 AM
సాయిరోనక్, గనవి లక్ష్మణ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘లగ్గం’. ‘భీమదేవరపల్లి బ్రాంచి’ చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రమేశ్ చెప్పాల ఈ సినిమాకు దర్శకుడు. రాజేంద్రప్రసాద్ కీలకపాత్ర పోషిస్తున్నారు...
సాయిరోనక్, గనవి లక్ష్మణ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘లగ్గం’. ‘భీమదేవరపల్లి బ్రాంచి’ చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రమేశ్ చెప్పాల ఈ సినిమాకు దర్శకుడు. రాజేంద్రప్రసాద్ కీలకపాత్ర పోషిస్తున్నారు. సోమవారం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘‘లగ్గం’ విందు భోజనం లాంటి సినిమా. ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని విఽధంగా నా పాత్ర ఉంటుంది. నా కెరీర్‌లో ‘పెళ్లి పుస్తకం’ తర్వాత అంత గొప్ప పాత్ర ఈ సినిమాలో చేస్తున్నాను. తెలుగు వారందరికీ ఈ కథ నచ్చుతుంది’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘పెళ్లి అంటే రెండు కుటుంబాల కలయిక మాత్రమే కాదు రెండు మనసుల కలయిక అని చెప్పే చిత్రమిది. గట్టి దావత్ ఇవ్వబోతున్నాం’ అన్నారు. ‘వినోదంతో పాటు భావోద్వేగాల సమాహారంగా ఈ చిత్రం ఉండబోతోంది, తెలంగాణలో వివాహ సంస్కృతిని కళ్లకు కడుతుంది’ అని సాయిరోనక్ చెప్పారు. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి