గుర్తుండిపోయే పాత్ర

ABN , Publish Date - Jul 25 , 2024 | 06:17 AM

సందీప్‌ కిషన్‌ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రాయన్‌’. తమిళ నటుడు ధనుశ్‌ స్వీయ దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. కళానిధి మారన్‌ నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా...

సందీప్‌ కిషన్‌ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రాయన్‌’. తమిళ నటుడు ధనుశ్‌ స్వీయ దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. కళానిధి మారన్‌ నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా సందీప్‌ కిషన్‌ మీడియాతో ముచ్చటించారు.

‘‘ఇది ధనుశ్‌ నటించిన 50వ చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే తగ్గట్లే ఆయన ప్రతీ విషయంలో జాగ్రత్త పడ్డారు. అద్భుతమైన స్ర్కీన్‌ప్లేతో నడిచే ఈ సినిమాలో ప్రతీ సన్నివేశం కొత్తగా ఉంటుంది. ఇందులో నేను పోషించిన పాత్ర చాలా కీలకం. నా కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్ర ఇది. సినిమాలో యాక్షన్‌ మాత్రమే కాకుండా మనసుకు హత్తుకునే భావేద్వేగాలు, అందరినీ అలరించే వినోదం ఉంటుంది. ఇది ‘రాయన్‌’ అనే ఇంటిపేరు గల ఓ ఫ్యామిలీతో ముడిపడిన కథ. సినిమాలో వచ్చే ప్రతీ పోరాట ఘట్టం ప్రత్యేకంగా ఉంటుంది. సినిమా చూసే ప్రేక్షకులు కొత్త అనుభూతికి లోనవుతారు. ఏ.ఆర్‌. రెహమాన్‌ అందించిన పాటలు సినిమాకు అదనపు ఆకర్షణ’’ అని చెప్పారు.

Updated Date - Jul 25 , 2024 | 06:17 AM