యుద్ధం నేపథ్యంలో ప్రేమకథ

ABN , Publish Date - Sep 15 , 2024 | 02:48 AM

సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌, విక్కీ కౌశల్‌ నటిస్తున్న చిత్రం ‘లవ్‌ అండ్‌ వార్‌’. జనవరిలో సినిమాను మేకర్స్‌ ప్రకటించిన మేకర్స్‌.. వచ్చే ఏడాది క్రిస్‌మ్‌సకు సినిమాను విడుదల చేస్తున్నట్లు...

సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌, విక్కీ కౌశల్‌ నటిస్తున్న చిత్రం ‘లవ్‌ అండ్‌ వార్‌’. జనవరిలో సినిమాను మేకర్స్‌ ప్రకటించిన మేకర్స్‌.. వచ్చే ఏడాది క్రిస్‌మ్‌సకు సినిమాను విడుదల చేస్తున్నట్లు మొదట తెలిపారు. అయితే, తాజాగా, ఈ సినిమా విడుదల తేదీని మార్చారు. 2026లో మార్చి 20న రంజాన్‌ సందర్భంగా సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ ఎపిక్‌ లవ్‌ డ్రామా కథేంటేంటన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సినిమా కథను మేకర్స్‌ ప్రకటించకున్నా.. ఇది యుద్ధం నేపథ్యంలో జరిగే ప్రేమకథ అని టాక్‌ వినిపిస్తోంది. అదే రోజున షారుక్‌ ఖాన్‌ నటించిన క్రైమ్‌ డ్రామా ‘కింగ్‌’ సినిమా విడుదలవుతోంది. కాగా, సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలోనే ‘సావరియా’ చిత్రంతో రణ్‌బీర్‌ సినీ రంగ ప్రవేశం చేశారు.

Updated Date - Sep 15 , 2024 | 02:48 AM