వంద రోజుల్లో విజయాలెన్నో...

ABN , Publish Date - Sep 28 , 2024 | 05:56 AM

ఆరు హిట్స్‌... అనేక ఫ్లాపులతో చిత్రసీమ ప్రథమార్థాన్ని ముగించింది. అతి కీలకమైన ద్వితీయార్థంలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో.. భారీ చిత్రాలు అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి. ఇప్పటికే మూడు నెలలు ముగిశాయి. ఇక ఉన్నది మూడు నెలలే.. ఈ మూడు నెలల్లో అరడజను

ఆరు హిట్స్‌... అనేక ఫ్లాపులతో చిత్రసీమ ప్రథమార్థాన్ని ముగించింది. అతి కీలకమైన ద్వితీయార్థంలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో.. భారీ చిత్రాలు అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి. ఇప్పటికే మూడు నెలలు ముగిశాయి. ఇక ఉన్నది మూడు నెలలే.. ఈ మూడు నెలల్లో అరడజను భారీ చిత్రాలు క్యూలో ఉండటం విశేషం. వాటిలో అలరించేవి ఎన్ని.. చరిత్ర సృష్టించేవి ఏవి.. అంచనాలను తారుమారు చేసేవి ఎన్నో తెలియాలంటే ఏడాదిలోని ఆఖరి వారం వరకూ వేచి చూడాల్సిందే.

పుష్పరాజ్‌ కోసం ఎదురుచూపులు

2021లో విడుదలైన ‘పుష్ప’ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో ఏ రేంజ్‌లో సత్తా చాటిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు కొనసాగింపుగా పార్ట్‌ 2 ఉంటుందని దర్శకుడు సుకుమార్‌ మంచి హైప్‌తో క్లైమాక్స్‌ను ముగించారు. మొదటి భాగానికి మించిన హిట్‌ కొట్టాలనే లక్ష్యంతో మేకర్స్‌ ఈ సీక్వెల్‌ను చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దుతున్నారు. మొదటి భాగంలో పుష్పరాజ్‌గా అందరినీ అలరించిన అల్లుఅర్జున్‌.. రెండో భాగం ‘పుష్ప:ద రూల్‌’లో ఏ రేంజ్‌లో చెలరేగుతాడో అని అభిమానులు ఆసక్తిగా కోసం ఎదురుచూస్తున్నారు. డిసెంబరు 6న సినిమా విడుదల కానుంది.

Untitled-11.jpg


గేమ్‌ చేంజర్‌గా...

రామ్‌చరణ్‌, డైరెక్టర్‌ శంకర్‌ కలయికలో తెరకెక్కుతోన్న మాగ్నమ్‌ ఆపస్‌ ఎంటర్టైనర్‌ ‘గేమ్‌ చేంజర్‌’. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని టాక్‌. అందులో ఒక పాత్ర అవినీతితో పోరాటం చేస్తుందని సమాచారం. ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. డిసెంబరు 20న ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

దసరాకి వేట మొదలు

‘జై భీమ్‌’ ఫేమ్‌ టీ.జే.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటిస్తున్న చిత్రం ‘వేట్టయాన్‌’ (ద హంటర్‌). ఇందులో అమితాబ్‌ బచ్చన్‌, రానా దగ్గుబాటి, ఫహాద్‌ ఫాజిల్‌, మంజువారియర్‌, రితికా సింగ్‌ కీలక పాత్రలు పోషించారు. రజనీకాంత్‌, అమితాబ్‌ 33 ఏళ్ల తర్వాత కలసి నటిస్తున్న చిత్రం ఇదే కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇందులో ఎన్‌కౌంటర్‌ స్పెషలి్‌స్టగా రజనీ కనిపించనున్నారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబరు 10న ప్రేక్షకులను పలకరించనుంది. ‘జైలర్‌’తో సూపర్‌ హిట్‌ కొట్టి మంచి ఫామ్‌లో ఉన్న రజనీకాంత్‌కు ఈ సినిమా అంతకుమించిన సక్సెస్‌ ఇస్తుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కన్నప్ప కనువిందు...

మంచు విష్ణు నటిస్తున్న మైథలాజికల్‌ చిత్రం ‘కన్నప్ప’. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ముఖేశ్‌కుమార్‌ సింగ్‌ దర్శకుడు. ఇందులో ప్రభాస్‌, అక్షయ్‌కుమార్‌, మోహన్‌లాల్‌ సహా పలువురు తారలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను కేన్స్‌ చిత్రోత్సవంలో విడుదల చేయడం విశేషం. డిసెంబర్‌ 20న విడుదల చేయడానికి మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.


పోరాట యోధుడి పాత్రలో...

తమిళ హీరో సూర్య పోరాట యోధుడిగా.. నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘కంగువ’. నవంబర్‌ 14న దాదాపు పది భాషల్లో త్రీడీలో, 2డీలో విడుదలవుతోంది. ఈ భారీ పీరియాడికల్‌ యాక్షన్‌ ఫిల్మ్‌కు ‘వేదాలమ్‌’, ‘వీరుడొక్కడే’, ’వివేకం’ వంటి చిత్రాలు తీసిన శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో సూర్యకు పాన్‌ ఇండియా గుర్తింపు ఖాయం అని ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు.

గోపీచంద్‌ విశ్వం

గోపీచంద్‌ నటిస్తున్న యాక్షన్‌ ఎంటర్టైనర్‌ ‘విశ్వం’. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. వరుస ఫ్లాపుల్లో ఉన్న గోపీచంద్‌కు, శ్రీనువైట్లకు ఈ సినిమా రిజల్ట్‌ కీలకం కానుంది. దసరా కానుకగా అక్టోబర్‌ 11న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - Sep 28 , 2024 | 05:56 AM