ప్రకృతిని కాపాడే బందీ

ABN , Publish Date - Sep 13 , 2024 | 04:34 AM

ఆదిత్య ఓం నటించిన ‘బందీ’ చిత్రం త్వరలో విడుదల కానుంది. తిరుమల రఘు స్వీయ దర్శకత్వంలో వెంకటేశ్వరరావుతో కలసి ఈ సినిమాను నిర్మించారు...

ఆదిత్య ఓం నటించిన ‘బందీ’ చిత్రం త్వరలో విడుదల కానుంది. తిరుమల రఘు స్వీయ దర్శకత్వంలో వెంకటేశ్వరరావుతో కలసి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ విడుదల చేసిన అనంతరం రఘు మాట్లాడుతూ ‘ఒకే ఒక్క పాత్రతో రూపుదిద్దుకున్న చిత్రమిది. ప్రకృతిని నాశనం చేసే కార్పొరేట్‌ కంపెనీలకు లీగల్‌ అడ్వైజర్‌గా ఉండే పాత్రను ఆదిత్య ఓం పోషించారు. అటువంటి వ్యక్తిని అడవుల్లో వదిలేస్తే ఏలా ఉంటుందనే ఆసక్తికరమైన కథనంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. మా హీరో ఇప్పుడు ‘బిగ్‌బాస్‌’లో ఉన్నారు. ఆయన సక్సెస్‌ అయి వస్తాడని ఆశిస్తున్నాం. త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం’ అని చెప్పారు. అమెరికాలో ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వీఎఫ్‌ఎక్స్‌ హెడ్‌ జాకబ్‌ చెప్పారు.

Updated Date - Sep 13 , 2024 | 04:34 AM