సవాలుతో కూడుకున్న విషయం

ABN , Publish Date - Aug 14 , 2024 | 02:57 AM

తెలుగులోనూ మంచి పాపులారిటీ ఉన్న తమిళ సంగీత దర్శకుల్లో జి.వి.ప్రకాశ్‌ ఒకరు. ఆయన సంగీతం అందించిన లేటెస్ట్‌ చిత్రం ‘తంగలాన్‌’. ఈ గురువారం సినిమా విడుదలవుతున్న...

తెలుగులోనూ మంచి పాపులారిటీ ఉన్న తమిళ సంగీత దర్శకుల్లో జి.వి.ప్రకాశ్‌ ఒకరు. ఆయన సంగీతం అందించిన లేటెస్ట్‌ చిత్రం ‘తంగలాన్‌’. ఈ గురువారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ‘‘ఇలాంటి పీరియాడికల్‌ ఫిల్మ్‌కు సంగీతం అందించడం చాలా సవాలుతో కూడుకున్న విషయం. ఇలాంటి నేపథ్యం ఉన్న సినిమాలకు పనిచేసే అవకాశం అరుదుగా వస్తుంటుంది. అందుకే ఈ చాన్స్‌ మిస్స్‌ చేసుకోవాలనుకోలేదు. ఒక సంగీత దర్శకుడిగా ఈ సినిమాకు పనిచేయడం ఎంతో సంతృప్తినిచ్చింది. ఈ సినిమాకు ఎలాంటి సంగీతం అందించాలనే విషయమై చాలా పరిశోధన చేశాను. దర్శకుడు పా.రంజిత్‌ విజన్‌ చాలా బాగుంటుంది. థియేటర్లలో పూనకాలు తెప్పించే సన్నివేశాలు సినిమాలో చాలా ఉన్నాయి. ఇప్పటకే రిలీజైన పాటలకి మంచి స్పందన వస్తోంది’’ అని చెప్పారు.

Updated Date - Aug 14 , 2024 | 02:57 AM