రూ.5 కోట్ల పరువునష్టం దావా

ABN , Publish Date - Aug 19 , 2024 | 04:53 AM

సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌రాజాపై చెన్నైలోని తిరువల్లికేణి పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. తమకు ఇవ్వాల్సిన రూ.20 లక్షల అద్దె చెల్లించలేదని అజ్మత్‌ బేగం, ఆమె సోదరుడు...

సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌రాజాపై చెన్నైలోని తిరువల్లికేణి పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. తమకు ఇవ్వాల్సిన రూ.20 లక్షల అద్దె చెల్లించలేదని అజ్మత్‌ బేగం, ఆమె సోదరుడు మహ్మద్‌ జావిద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘దాదాపు రూ.20 లక్షల అద్దెను యువన్‌ శంకర్‌రాజా చెల్లించాలి. ఆ విషయమై ఫోన్‌ చేస్తే లిఫ్ట్‌ చేయడం లేదు. మాకు తెలియకుండా సైలెంట్‌గా సామాన్లను వేరే చోటికి ఫిఫ్ట్‌ చేశారు’’ అని అందులో ఆరోపించారు. వారిపై యువన్‌ రూ. కోట్లకు పరువునష్టం దావా వేశారు. ఈమేరకు అజ్మత్‌ బేగం, మహ్మద్‌ జావిద్‌లకు నోటీసులు పంపారు.

Updated Date - Aug 19 , 2024 | 04:53 AM