14 Movie: ‘14’ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

ABN , Publish Date - Jun 26 , 2024 | 06:15 PM

రాయల్ పిక్చర్స్ పతాకంపై లక్మీ శ్రీనివాస్ దర్శకత్వంలో, సుబ్బారావు రాయన మరియు శివకృష్ణ నిచ్చన మెట్ల సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘14’. ఈ చిత్రం జూలై 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డైరెక్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్ డైరెక్టర్ వీర శంకర్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

14 Movie: ‘14’ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
14 Movie Poster

రాయల్ పిక్చర్స్ పతాకంపై లక్మీ శ్రీనివాస్ దర్శకత్వంలో, సుబ్బారావు రాయన మరియు శివకృష్ణ నిచ్చన మెట్ల సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘14’. ఈ చిత్రం జూలై 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ (14 Movie First Look Poster)ను డైరెక్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్ డైరెక్టర్ వీర శంకర్ (Director Veera Shankar) చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

Also Read-Kalki 2898AD Review: మహాభారత యుద్ధం తరువాత ఏమి జరిగిందో ఊహాత్మకంగా...

ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అనంతరం వీరశంకర్ మాట్లాడుతూ.. అద్భుతమైనటువంటి స్క్రీన్‌ప్లేతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ ‘14’ చిత్రం కచ్చితంగా మంచి హిట్ అవుతుంది. సరికొత్త కథతో ఈ సినిమాను తెరకెక్కించిన యూనిట్‌కు అభినందనలు. పోస్టర్ కూడా వినూత్నంగా ఉంది. తెలుగు ప్రేక్షకులకు కొత్తదనాన్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తారు. ఈ సినిమాను కూడా కచ్చితంగా హిట్ చేస్తారని అన్నారు. (14 Movie First Look Launched)


14-Poster.jpg

కాగా.. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో నోయల్, విషాక ధీమాన్ ప్రధాన పాత్రలు పోషించగా.. రతన్, పోసాని కృష్ణ మురళి, శ్రీకాంత్ అయ్యంగార్, రూపాలక్ష్మి తదితరులు ఇతర పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి కళ్యాణ్ నాయక్ పాటలు అందించగా.. ఆదిత్య భార్గవ్ మాటలు రాశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేసి, టీమ్‌ని అభినందించిన డైరెక్టర్ వీరశంకర్‌కు చిత్ర బృందం కృతజ్ఞతలు తెలిపింది.

Read Latest Cinema News

Updated Date - Jun 26 , 2024 | 07:52 PM