HanuMan: ‘హనుమాన్’ 100 రోజులు.. తెరవెనుక అసలు హీరో ఆయనేనా?
ABN , Publish Date - Apr 23 , 2024 | 03:21 PM
సూపర్ హీరో కాన్సెప్ట్‌కి ఇండియన్ మైథాలజీని లింక్ చేసి తెరకెక్కించిన ‘హనుమాన్’ అద్భుతానికి ఆడియన్స్ ఫిదా అయ్యారు. థియేటర్స్‌లో ‘హనుమాన్’ చేసిన వీరవిహారానికి ప్రేక్షకులు మంత్రముగ్దులు అయ్యారు. ఈ రోజుల్లో ఊహకందని విధంగా ఏకంగా 100 రోజులు థియేటర్లలో నడిచి తెలుగు సినిమా సత్తా ఏంటో మరోసారి చాటిన ఈ చిత్రానికి తెరవెనుక హీరో ఆయనే అంటూ విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఎవరాయన? అంటే..
2024 సంక్రాంతికి వచ్చిన ‘హనుమాన్’ (HanuMan) ఇప్పుడు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఓ సంచలనంగా మారింది. సూపర్ హీరో (Super Hero) కాన్సెప్ట్‌కి ఇండియన్ మైథాలజీని లింక్ చేసి తెరకెక్కించిన ఈ అద్భుతానికి ఆడియన్స్ ఫిదా అయ్యారు. థియేటర్స్‌లో ‘హనుమాన్’ చేసిన వీరవిహారానికి ప్రేక్షకులు మంత్రముగ్దులు అయ్యారు. ఈ రోజుల్లో ఊహకందని విధంగా ఏకంగా 100 రోజులు (100 Days to Hanuman) థియేటర్లలో నడిచి తెలుగు సినిమా సత్తా ఏంటో మరోసారి నిరూపించిన సినిమా ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో కె నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ అద్భుత విజయానికి కారణమెవ్వరు అని కనుక ఒక్కసారి ప్రశ్నిస్తే దర్శకునితో పాటు కచ్చితంగా నిర్మాత కూడా ఉంటారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె. నిరంజన్ రెడ్డి (Producer K Niranjan Reddy) ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించి తెర వెనక హీరోలా నిలిచారు. ఈ సినిమా విడుదలకు ముందే ఈ ఫలితాన్ని అంచనా వేయగలిగారంటే నిరంజన్ రెడ్డి ఈ సినిమాను ఎంతలా అంకితభావంతో నిర్మించారో అర్థమవుతుంది.
*Hanuman Jayanti: తెలుగు సినిమాలో ఆంజనేయుడు అంటే ఆర్జా జనార్దన్ రావు
సినిమాలోని ప్రతి ఫ్రేమ్ గ్లోబల్ లెవల్ క్వాలిటీతో తీసినట్టు స్పష్టమవుతుంది. కథ ఎంపిక స్వయంగా పర్యవేక్షించి అమలు చేశారు. 15 కోట్ల బడ్జెట్ అనుకున్న సినిమాను 65 కోట్ల వరకు ఖర్చు చేశారంటే సినిమాను ఎంత నమ్మకంగా నిర్మించారో అర్థం చేసుకోవచ్చు. అదే నమ్మకంతో సినిమాను ఏకంగా సంక్రాంతి సీజన్‌లో జనవరి 12న విడుదల చేశారు. పెద్ద హీరోలు సంక్రాంతి బరిలో ఉన్నారు.. రిస్క్ చేయడమే.. అని అందరు అంటున్నా కూడా.. పక్కా ప్లాన్‌తో థియేటర్స్‌లో రిలీజ్ చేశారు. ఇంకేముంది ఓ యజ్ఞంలా నిర్మించిన సినిమా మహద్భుతం క్రియేట్ చేసింది. ఈ రోజుల్లో వంద రోజుల పాటు థియేటర్‌లలో నడిచిన సినిమాగా రికార్డు సృష్టించడమే కాకుండా కలెక్షన్లలోనూ సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది. దీనికి కారణమైన తెరవెనుక అసలు హీరో (Real Hero).. నిర్మాత కె. నిరంజన్ రెడ్డి అంటూ సినీ విశ్లేషకులు సైతం కొనియాడుతుండటం విశేషం.
ఈ సినిమాతో సినిమా పట్ల ఆయనకు ఉన్న ప్యాషన్‌తో పాటు భక్తి శ్రద్ధలు కూడా తెలియవచ్చాయి. అదెలా అంటే.. ఈ సినిమాకు తెగిన ప్రతి టికెట్ నుండి రూ. 5 చొప్పున అయోధ్య రామ మందిరానికి (Ayodhya Ram Mandhir) విరాళంగా ఇచ్చి తన దైవభక్తిని చాటారు నిర్మాత నిరంజన్ రెడ్డి. రాబోయే ‘జై హనుమాన్’ (Jai Hanuman)తో మరోసారి హిస్టరీ క్రియేట్ చేసేందుకు ప్రస్తుతం ఆయన సమాయత్తమవుతున్నారు.
Read Latest Cinema News