Devara: బాలీవుడ్‌లో ‘దేవర’ పరిస్థితి ఏంటి.. అక్కడ గట్టెక్కేనా

ABN , Publish Date - Sep 26 , 2024 | 06:31 PM

మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘దేవర’ మూవీ రిలీజ్‌పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమా హిందీ బెల్ట్‌లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందనే దానిపై అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. ఒక్కసారి బాలీవుడ్‌లో ‘దేవర’ పరిస్థితి ఏంటనే విషయానికి వస్తే..

Devara Movie Team

మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘దేవర’ (Devara) మూవీ రిలీజ్‌పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అటు ఆంధ్రా ఇటు తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో ‘దేవర’ మాస్ టికెట్ బుకింగ్స్ మేకర్స్‌కి సంతోషాన్ని కలిగిస్తున్నాయి. కానీ.. హిందీ బెల్ట్‌లో ఈ హడావుడి అంతంతా మాత్రంగానే ఉండటం నిర్మాతలని కాస్త కలవర పెడుతోంది. వాస్తవానికి సౌత్ స్టార్ డైరెక్టర్స్‌కి అక్కడ మార్కెట్ అంతంత మాత్రమే. సౌత్‌లో బ్లాక్ బస్టర్స్‌గా నిలిచిన అనేక సినిమాలు అక్కడ ఆలస్యంగా హిట్ బాటనెక్కాయి. అయితే ‘దేవర’లో బాలీవుడ్ స్టార్స్ ఉన్నారు కాబట్టి హిందీ ఆడియెన్స్ ఈ సినిమాకు ఎలా రెస్పాండ్ అవుతారనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Also Read- Prakash Raj Vs Pawan: పవన్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్‌

వాస్తవానికి రాజమౌళి‌ (Rajamouli)కి మినహా బాలీవుడ్‌లో ఏ స్టార్ డైరెక్టర్‌కి బ్రాండ్ ఇమేజ్ లేదు. ‘కాంతార, కెజియఫ్’ వంటి సినిమాలు సైతం నెమ్మదిగా హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్‌కి కల్ట్ ఫాలోయింగ్ ఏర్పడటంతో ‘కల్కి 2898AD’ సినిమా వరకు ప్రభాస్‌‌ని హిందీ ఆడియెన్స్ ఆరాధిస్తూ వస్తున్నారు. కానీ.. ప్రతి హీరోకి ఆ కల్ట్ స్టేటస్ సాధించడం సులువు కాదు. అల్లు అర్జున్ పుష్ప (Pushpa) సినిమా కూడా మొదట్లో మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుని.. రెండో వారంలోనే కల్ట్ ఫాలోయింగ్ సంపాదించింది. దీంతో ‘పుష్ప 2’పై హిందీలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.


Devara-2.jpg

‘దేవర’ విషయానికొస్తే జూనియర్ ఎన్టీయార్ తన భాషాభినయంతో కొంతమేరకు హిందీ ఆడియెన్స్‌కి దగ్గరైనా, కల్ట్ బేస్ మాత్రం లేదు. కాస్త పాజిటివ్ టాక్ వస్తే చాలు హిందీ ఆడియెన్స్ సినిమాలని చూసేందుకు వెనుకాడరు. సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్‌ల స్టార్‌డమ్ ఆడియెన్స్‌ని అట్రాక్ట్ చేయడానికి తోడ్పడే అవకాశం అయితే ఉంది. మరో వైపు ‘స్త్రీ 2’ సినిమా కూడా స్లో కావడంతో పాటు బాలీవుడ్‌లో అక్టోబర్ 11న రిలీజ్ అయ్యే ఆలియా జిగ్రా మూవీ మినహా పోటీలో ఏ మూవీ లేకపోవడం కలిసొచ్చే అంశం. చూడాలి మరి.. ‘దేవర’ బాలీవుడ్‌లో ఎలా పెర్ఫార్మ్ చేస్తాడో..

Also Read- Movie Ticket Mafia: అభిమానుల జేబులు గుల్ల చేస్తున్న బెనిఫిట్‌ షోలు

Also Read- Harsha Sai: అసలెవరీ హర్షసాయి.. మరో మెగాస్టార్ అంటూ బిల్డప్ ఇచ్చిన వారంతా ఏమయ్యారు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 26 , 2024 | 06:31 PM