పెళ్లి జరిగిన అపార్ట్‌మెంట్ అమ్మకానికి!
ABN , Publish Date - Aug 21 , 2024 | 01:36 AM
నటి సోనాక్షి సిన్హా ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె తను నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌ను అమ్మకానికి పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గత ఏడాది సెప్టెంబరులో ముంబైలోని బాంద్రాలో...
నటి సోనాక్షి సిన్హా ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె తను నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌ను అమ్మకానికి పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గత ఏడాది సెప్టెంబరులో ముంబైలోని బాంద్రాలో రూ.11 కోట్లు పెట్టి ఆమె ఓ ఇంటిని కొన్నారు. అదే అపార్ట్‌మెంట్లో ఇటీవలే ఆమె జహీర్ ఇక్బాల్‌ను వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఆ అపార్ట్‌మెంట్‌ను ఆమె రూ.25 కోట్లకు అమ్మకానికి పెట్టారు. ఏడాది కూడా కాకుండానే.. అదీ వారిద్దరి పెళ్లి జరిగిన అపార్ట్‌మెంట్‌ను ఇలా సడెన్‌గా అమ్మకానికి పెట్టడం అందరిలో కుతూహలాన్ని రేకెత్తిస్తోంది. అసలు ఈ అపార్ట్‌మెంట్ అమ్మడానికి అసలు కారణం ఏంటా అని అభిమానులు నెట్టింట చర్చిస్తున్నారు.