Vicky Kaushal: గుడ్ న్యూస్ ఏమీ లేదు.. బ్యాడ్ న్యూజ్ ఎంజాయ్ చేయండి!
ABN , Publish Date - Jul 16 , 2024 | 02:04 PM
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ (Vicky kaushal) సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుంటారు. ప్రస్తుతం 'బ్యాడ్‌న్యూజ్’ (Bad newz)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ (Vicky kaushal) సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుంటారు. ప్రస్తుతం 'బ్యాడ్‌న్యూజ్’ (Bad newz)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 'యానిమల్' బ్యూటీ త్రిప్తి డిమ్రీ (Tripti Dimri) హీరోయిన్‌గా నటించింది. ఇటీవలే ఓ ఓ సాంగ్ విడుదల చేశారు. అందులో హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ అదిరిపోయిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆనంద్ తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తుంది. ప్రస్తుతం టీమ్ అంతా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా ఢిల్లీలో నిర్వహించిన ఈవెంట్‌లో విక్కీ కౌశల్ పాల్గొన్నారు. ఈ వేదికపై పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. మీ భార్య కట్రీనా గర్భవతి అని వార్తలు వస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? అని విక్కీ కౌశల్‌ను ప్రశ్నించారు.
దీనికి ఆయన స్పందిస్తూ.. ‘ఇలాంటి విషయాన్ని అభిమానులతో పంచుకునేందుకు చాలా సంతోషిస్తాం.. ఏదైనా ఉంటే మీతోనే ముందుగా పంచుకుంటాం, ప్రస్తుతానికేౖతే ఎలాంటి శుభవార్త లేదు. అవన్నీ రూమర్లే’’ అని చెప్పారు. ప్రస్తుతానికి 'బ్యాడ్ న్యూజ్’ సినిమాను ఎంజాయ్ చేయండి.. ఏదైనా గుడ్ న్యూస్ ఉంటే మీతో తప్పకుండా పంచుకుంటాం అని నవ్వుతూ అన్నారు. ఇటీవల ముంబైలో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల వివాహానికి కట్రీనా కైఫ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమెను చూసిన వారంతా బేబీ బంప్‌తో ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. ఆ వార్త వైరల్ కావడంతో విక్కీ కౌశల్ మరోసారి క్లారిటీ ఇచ్చారు.