Vicky kaushal: ఇసుక మాఫియా నాపై దాడి చేసింది!

ABN , Publish Date - Jul 22 , 2024 | 03:36 PM

విక్కీకౌశల్‌(Vicky Kaushal), త్రిప్తి డిమ్రీ (Tripthi Dimri) నటించిన 'బ్యాడ్‌న్యూస్‌’ (Bad newz) ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది.  ఆనంద్‌ తివారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి టాక్‌ సొంతం చేసుకుంది.

విక్కీకౌశల్‌(Vicky Kaushal), త్రిప్తి డిమ్రీ (Tripthi Dimri) నటించిన 'బ్యాడ్‌న్యూస్‌’ (Bad newz) ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది.  ఆనంద్‌ తివారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ప్రమోషన్స్  లో బిజీగా ఉన్న విక్కీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. కెరీర్‌ బిగినింగ్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఎదురైన ఇబ్బందుల గురించి చెప్పారు విక్కీ.

‘‘బాలీవుడ్‌ దర్శకడు అనురాగ్‌ కశ్యప్‌ వద్ద నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశా. ఆయన తెరకెక్కించిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాసేపూర్’ కోసం ఏడీగా పనిచేశా. ఆ సినిమాలో బొగ్గు స్మగ్లింగ్‌ సన్నివేశాలు రియల్‌గా షూట్‌ చేసినవి. ఇసుక అక్రమ తవ్వకాలను షూట్‌ చేయడం కోసం వెళ్లినప్పుడు ఒక సంఘటన జరిగింది. అక్కడ పరిస్థితులు చూసి ఆశ్చర్యపోయా. ఎలాంటి భయం లేకుండా బహిరంగంగానే కొంతమంది ఇసుక స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారని తొలిసారి గ్రహించా. అక్కడి పరిస్థితులను రహస్యంగా షూట్‌ చేస్తున్నప్పుడు కొంతమంది మా వద్దకు వచ్చారు. దాదాపు 500 మంది మమ్మల్ని చుట్టుముట్టారు. ఆ ముఠాకు చెందిన ఒక వ్యక్తి మా కెమెరామెన్‌ను కొట్టి, కెమెరా లాక్కున్నాడు. మాపై దాడి చేయబోతుంటే అక్కడి నుంచి పారిపోయాం. అలాగే, బెనారస్‌ స్టేషన్లో  నవాజుద్దీన్‌ సిద్థిఖీపై సన్నివేశాలు షూట్‌ చేస్తున్నప్పుడు పోలీసులు మమ్మల్ని పట్టుకోబోయారు. మేము కారులో కెమెరా పెట్టి సీక్రెట్‌గా షూట్‌ చేస్తున్నాం. దాన్ని పోలీసులు గుర్తించారు. దాంతో మేము అక్కడి నుంచి పారిపోయాం’’ అని విక్కీ కౌశల్‌ తెలిపారు.

Updated Date - Jul 22 , 2024 | 03:39 PM