టీవీ చూస్తూ గుండె నొప్పితో.. తుది శ్వాస విడిచారు

ABN , Publish Date - Jul 09 , 2024 | 03:00 PM

ప్రముఖ గాయని ఉషా ఉతుప్‌ (Usha Uthup) ఇంట  విషాదం నెలకొంది. తమె భర్త జానీ చాకో ఉతుప్ (Jani Chacko uthup-78) సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

ప్రముఖ గాయని ఉషా ఉతుప్‌ (Usha Uthup) ఇంట  విషాదం నెలకొంది. తమె భర్త జానీ చాకో ఉతుప్ (Jani Chacko uthup-78) సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కోల్‌కతాలోని వారి నివాసంలో ఆయన గుండెపోటుతో మరణించారు. టీవీ చూస్తున్న సమయంలో ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన కన్నుమూసినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మంగళవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఉషా ఉతుప్‌కు కుమారుడు సన్నీ, కుమార్తె అంజలి ఉన్నారు. తండ్రి మరణంపై అంజలి తన సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. ‘నాన్నా.. మమ్మల్ని అందరినీ వదిలేసి చాలా త్వరగా వెళ్లిపోయావు. నువ్వు ఎంతో స్టైలిష్‌గా జీవించావు. ప్రపంచంలో అత్యంత అందమైన మనిషివి. మేము నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం’ అని  పోస్ట్‌లో పేర్కొన్నారు.


ఉషా ఉతుప్‌ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ఎన్నో హిట్‌ సాంగ్‌లను ఆమె పాడి అలరించారు. సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు. 1971లో ‘హరేరామ హరేకృష్ణ’ సినిమాలోని పాటకు ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ‘కీచురాళ్లు’ టైటిల్‌ సాంగ్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఉషా ఇక్కడ కూడా చాలా పాటలు పాడి అలరించారు. అల్లు అర్జున్‌ హీరోగా వచ్చిన ‘రేసుగుర్రం’ టైటిల్‌ సాంగ్‌తో ఓ ఊపు ఊపారు. 15 భారతీయ భాషలతోపాటు విదేశీ భాషల్లోనూ ఆమె పాడారు. ఆమె సంగీత రంగానికి చేసిన సేవలకు గాను ఇటీవలే భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించింది.  

Updated Date - Jul 09 , 2024 | 03:03 PM