Tanuj Virwani: అక్షరతో బ్రేకప్‌కు ఫొటోలు కారణం కాదు!
ABN , Publish Date - Sep 10 , 2024 | 04:36 PM
కమల్ హాసన్ (jamal Haasan) కుమార్తె అక్షర హాసన్‌తో నాలుగేళ్లు డేటింగ్ తర్వాత బాలీవుడ్ నటుడు తనూజ్ వీర్వాణి (Tanooh virwani) బ్రేకప్ చెప్పారు.
కమల్ హాసన్ (jamal Haasan) కుమార్తె అక్షర హాసన్‌తో నాలుగేళ్లు డేటింగ్ తర్వాత బాలీవుడ్ నటుడు తనూజ్ వీర్వాణి (Tanooh virwani) బ్రేకప్ చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అక్షర హాసన్ ప్రైవేట్ ఫొటోలు లీక్ కావడం, బ్రేకప్ గురించి స్పందించారు. తనూజ్ మాట్లాడుతూ ‘‘బ్రేకప్ (Breakup with Akshara Haasan) తర్వాత కూడా నేను అక్షరతో మాట్లాడుతూనే ఉన్నాను. ప్రేమలో ఉన్న వ్యక్తులు పరస్పరం ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఒకరికోసం ఒకరు అండగా నిలబడాలి. మా ఇద్దరికీ ఆ విషయంలో విభేదాలు వచ్చాయి. అందుకే విడిపోయాం. ఆమె ప్రైవేటు ఫొటోలు లీక్ అయిన కారణంగా నేను బ్రేకప్ చెప్పలేదు. కానీ.. ఆ వివాదం తర్వాత మా ఇద్దరికీ దూరం పెరిగింది. అవి నా కారణంగా లీక్ అయ్యాయని ఆమె భావించింది. అందుకే అవసరం ఉన్నప్పుడు ఆమె నాకు అండగా నిలబడలేకపోయింది. ఈ విషయంలో నేను ఆమెను నిందించాలనుకోవడం లేదు.. ఎందుకంటే ఎవరి కారణాలు వాళ్లకు ఉంటాయి’’ అని అన్నారు. గతంలోనూ ఈ విషయంపై తనూజ్ మాట్లాడారు. ‘నేను అక్షర ప్రైవేటు ఫొటోలు లీక్ చేసినట్లు ఎన్నో పత్రికల్లో రాశారు. ఈ విషయాన్ని ఆమె ఖండించలేకపోయింది. వ్యక్తిగతంగా నన్ను నమ్మి నప్పటికీ బయట ప్రపంచానికి మాత్రం నా తప్పులేదని ఒక్క ప్రకటన కూడా ఇవ్వలేకపోయింది. ఆ విషయంలో ఎంతో బాధపడ్డాను. అక్షర ఫొటోలు లీక్ అవ్వడంపై నిజం ఎప్పటికేౖనా బయటకు వస్తుందని నమ్ముతున్నా’ అని తనూజ్ వీర్వాణి తెలిపారు.