RIP Zakir Hussain: జాకీర్‌ మరణం.. విశ్వనాయకుడు ఏమన్నారో తెలుసా..  

ABN , Publish Date - Dec 16 , 2024 | 08:39 AM

ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్ ((Ustad Zakir Hussain) (73) కన్నుమూశారు. రక్తపోటు సంబంధిత సమస్యలతో బాధఫడుతున్న ఆయన రెండు క్రితం శాన్‌ ప్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో చేరారు

ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్ ((Ustad Zakir Hussain) (73) కన్నుమూశారు. రక్తపోటు సంబంధిత సమస్యలతో బాధఫడుతున్న ఆయన రెండు క్రితం శాన్‌ ప్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చికిత్స అందించారు. డాక్టర్ల ప్రయత్నం విఫలమైంది. ఆయన తుదిశ్వాస విడిచారు. తబలా మాస్ట్రో గా (Tabla maestro)పేరొందిన  జాకీర్‌  హుేస్సన్‌  1951 మార్చి 9న ముంబయిలో జన్మించారు. ప్రముఖ తబలా వాయిద్యకారుడు అల్లారఖా పెద్ద కుమారుడైన జాకీర్‌ హుేస్సన్‌   చిన్నప్పటి నుంచే తండ్రి బాటలో నడిచారు. ఈ క్రమంలో హిందుస్థానీ క్లాసికల్‌ మ్యూజిక్‌, జాజ్‌ ఫ్యూజన్‌లో నైపుణ్యం సాధించి సంగీతంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తొలుత ఆదివారం రాత్రి ఆయన చనిపోయినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఆయన చనిపోలేదని, పరిస్థితి విషమంగా ఉందని, చికిత్స అందుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు.  (Rip Ustad Zakir Hussain)

Zakir.jpg

1990లో సంగీత్‌ నాటక అకాడమీ అవార్డు, 2009లో గ్రామీ పురసస్కారం అందుకున్నారు. 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్‌, 2023లో పద్మవిభూషణ్‌ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను గౌరవించింది. జాకీర్‌ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మొత్తంగా ఐదు గ్రామీ అవార్డులు గెలుచుకున్న ఆయన.. ఈ ఏడాది మొదట్లో 66వ గ్రామీ అవార్డుల్లో మూడింటిని తన వశం చేసుకున్నారు. ఆరు దశాబ్దాల కెరీర్‌లో మన దేశంతోపాటు ఎంతో మంది అంతర్జాతీయ కళాకారులతో కలిసి పనిచేశారు. నస్సిర్ మున్నీ కబీర్‌ అనే రచతయిత 2018లో  'జాకీర్‌ హుస్సేన్: ఎ లైఫ్‌ ఇన్‌ మ్యూజిక్‌ అనే పుస్తకం రచించారు. జాకీర్‌ హుస్సేన్‌ మరణి వార్త తెలుసుకున్న దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు, రాజకీయ ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. (Zakir Hussain is no more)



జాకీర్‌ హుస్సేన్‌ మరణంపై విశ్వనాయకుడు కమల్‌హాసన్‌ స్పందించారు. ఈ మేరకు చేసిన ట్వీట్‌లో ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. "జాకీర్‌ భాయ్‌.. త్వరగా వెళ్లిపోయాడు. అయినా ఆయన మాకు ఇచ్చిన సమయం, పంచిన జ్ఞాపకాలు, కళ రూపంలో ఏదైతే మాకు ఇచ్చాడో అవన్నీ ఎప్పటికీ పదిలంగా ఉన్నాయి. మీకు వీడ్కోలు భాయ్‌’ అంటూ ట్వీట్‌ చేశారు. 

Updated Date - Dec 16 , 2024 | 09:00 AM