Sushant Singh Rajput: సుశాంత్ కేసులో రియా చక్రవర్తికి భారీ ఊరట.. సుప్రీం కీలక నిర్ణయం
ABN , Publish Date - Oct 25 , 2024 | 06:02 PM
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెత్ కేసులో సుప్రీం కోర్ట్ రియా చక్రవర్తికి భారీ ఉపశమనాన్ని ఇచ్చింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ ఓ సంచలనం. ఆయన మరణించి నాలుగేళ్లు గడుస్తున్నా ఆ కేసు ఓ కొలిక్కి రాలేదు. సుశాంత మరణానికి అతని ప్రేయసి రియా చక్రవర్తి కారణం అని సుశాంత్ తండ్రి ఫిర్యాదు చేయడంతో ఎన్సీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో రియాతోపాటు ఆమె సోదరుడిని అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆమె బెయిల్ మీద బయటికొచ్చింది. కెరీర్ పరంగా బిజీగా ఉంది. అయితే ఈ క్రమంలోనే ఈ కేసులో కీలక ట్విస్ట్ ఏర్పడింది. ఈ కేసుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది.
బాలీవుడ్ ప్రముఖ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో సుప్రీమ్ కోర్ట్ కీలక తీర్పు ప్రకటించింది. గతంలో బాంబే కోర్ట్ చెప్పినట్లు రియాతో పాటు ఆమె కుటుంబంపై ఉన్న లుక్ అవుట్ సర్క్యూలర్‌ను రద్దు చేయాలన్న తీర్పును సమర్ధించింది. కాగా బాంబే కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీమ్‌ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ని సుప్రీమ్ కోర్ట్ కొట్టేసింది. ఇంతకీ ఈ కేసులో ఏం జరిగిందంటే..
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సుశాంత్ 2020 జూన్ 14న ముంబైలోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. అనంతరం సుశాంత్ మరణంపై అనుమానాలున్నట్లు సుశాంత్ ప్రేయాసి రియా చక్రవర్తి ఫ్యామిలీపై కేసు నమోదు చేశారు. అలాగే సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి రూ.15 కోట్లు బదిలీ చేసుకున్నారని తండ్రి కేకే సింగ్ ఆరోపణలు చేశారు. ఈ కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు భావించి ఈడీ రియాను ప్రశ్నించింది. ఈ కేసుని సుప్రీం కోర్ట్.. సీబీఐకి అప్పజెప్పింది. ఈ క్రమంలోనే సీబీఐ సుశాంత్ మృతి కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్నరియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి విదేశాలకు వెళ్లకుండా ఎల్వోసీ జారీ చేసింది.