ప్రముఖ నటుడు మృతి.. విషాదంలో పరిశ్రమ
ABN , Publish Date - Nov 08 , 2024 | 03:58 PM
టెలివిజన్ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. పలు రియాలిటీ షోలతో నటుడిగా గుర్తింపు పొందిన నటుడు ఆత్మహత్య చేసుకున్నారు. బుల్లితెరపై ఇప్పుడిప్పుడే నటుడిగా తన పరిధిని విస్తరించుకుంటున్న సమయంలో సడెన్‌గా ఆయన ఇలా మృతి చెందడంపై కుటుంబ సభ్యులు, స్నేహితులు విలపిస్తున్నారు. ఇంతకీ ఎవరా నటుడంటే..
టెలివిజన్ నటుడు నితిన్ చౌహాన్ (Nitin Chauhan) మృతి చెందారు. ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన వయస్సు ప్రస్తుతం 35 సంవత్సరాలు. నితిన్ చౌహాన్ మృతి చెందిన విషయాన్ని నితిన్ చౌహాన్ స్నేహితులు సుదీప్ సాహిర్, విభూతి ఠాకుర్ ధ్రువీకరించారు. నితిన్ స్వస్థలం ఉత్తరప్రదేశ్ అలీగఢ్. చిన్నప్పటి నుండి సినిమాలపై ఇష్టంతో పెరిగిన నితిన్.. నటన నేర్చుకుని నటుడిగా మారేందుకు ముంబైకి వచ్చారు. ముంబైనే నివాసంగా మార్చుకున్నారు. ‘దాదాగిరి 2’ అనే రియాలిటీ షో విజేతగా నిలిచారు.
Also Read- Mahesh Babu: మహేష్ బాబుకి తేజ సజ్జా, రానా ఎందుకు సారీ చెప్పాలి
ఆ షో తర్వాత నితిన్ చౌహాన్ పేరు బాలీవుడ్‌లో బాగా వైరల్ అయింది. ఆ షో అనంతరం నితిన్ చౌహాన్ ‘స్ప్లిట్స్ విల్లా 5’, ‘జిందగీ డాట్ కామ్’, ‘క్రైమ్ పెట్రోల్’ వంటి రియాలిటీ షోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన ‘తేరా యార్ హూన్ మైన్’లో నితిన్ చివరిసారిగా స్క్రీన్‌పై కనిపించారు. ఇప్పుడిప్పుడే నటుడిగా తన పరిధిని విస్తరించుకుంటున్న నితిన్ చౌహాన్ సడెన్‌గా మృతి చెందడంతో ఒక్కసారిగా టెలివిజన్ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది.
మరో వారం రోజుల్లో నితిన్ 36వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు స్నేహితులు ప్లాన్ చేస్తుండగా.. ఇంతలోనే ఇలా జరిగిందంటూ ఆయన సన్నిహితులు విలపిస్తున్నారు. నితిన్ చౌహాన్ ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నట్లుగా ఆయన బంధువులు, స్నేహితులు తెలపడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసలు ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను, అసలు ఆత్మహత్యేనా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే నితిన్ చౌహాన్ మృతికి సంబంధించి పూర్తి వివరాలు తెలియనున్నాయి.