Sonu Sood: రాష్ట్రాన్ని ఏలే ఛాన్స్ వదులుకున్న.. సోనూసూద్‌ సెన్సేషనల్ కామెంట్స్

ABN , Publish Date - Dec 26 , 2024 | 04:36 PM

Sonu Sood: రీల్, రియల్ లైఫ్ హీరో అని తన అభిమానుల పిలిచే నటుడు సోనూసూద్‌. తాజాగా ఆయన ఓ చిత్ర ప్రమోషన్స్ లో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తనకు రాజకీయంగా పార్టీలు గొప్ప ఆఫర్లు ఇచ్చాయని తెలిపారు. ఆ తర్వాత ఆయన ఏం చేశారంటే..

Sonu Sood Was Offered Chief Minister Post

కరోనా, లాక్‌డౌన్‌ సమయంలో వేలాది మందికి అండగా నిలిచారు బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్‌ (Sonu sood). వలస కార్మికులు, పేదలు , విదేశాల్లో ఉండిపోయిన ఎంతోమంది 'ఆపదలో ఉన్నాం' అని చిన్న సందేశం ఇవ్వడం చాలు ‘నేనున్నా’ అంటూ సహకారం అందించి రియల్‌ హీరో అనిపించుకున్నారు. తాజాగా ఆయన రాజకీయాల గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.


ఓ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సోను సూద్‌ మాట్లాడుతూ.. " కొందరు రాజకీయ నాయకులు కొవిడ్‌ సమయంలో ప్రజలకు నేను సాయం చేసినందుకు గానూ సీఎం పదవిని ఆఫర్ చేశారు. నేను తిరస్కరిస్తే డిప్యూటీ సీఎం, రాజ్యసభ సభ్యత్వం కూడా అఫర్ చేశారు. నేను సున్నితంగా తిరస్కరించాను. స్వేచ్ఛను కోల్పోవడం నాకు ఇష్టం లేదు. అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నా. ప్రజలు రెండు కారణాల వల్ల రాజకీయాల్లోకి వస్తారు. ఒకటి డబ్బు సంపాదించడం కోసం లేదా అధికారం కోసం. వాటిలో దేనిపైనా నాకు ఆసక్తి లేదు. ప్రజలకు సాయం చేయడం కోసం రాజకీయాల్లోకి రావాలనుకుంటే.. అది నేను ఇప్పటికే చేస్తున్నాను" అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. సోనూసూద్‌ కి పదవులు అఫర్ చేసింది ఎవరని? విశ్లేషణలు మొదలు పెట్టారు.


మరోవైపు రీల్‌ హీరోగా ఉన్న ఆయన మరోసారి రియల్‌ హీరో అని నిరూపించుకున్నారు. కరోనా సమయంలో వేల మందికి సాయం చేసి రియల్‌ హీరో అనిపించుకున్న సోనూసూద్‌. ఆ తర్వాత సాయం కావాలని కోరిన వారికి చేయూతనందించారు. ఈ క్రమంలోనే సూద్‌ ఛారిటబుల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో తన తల్లి సరోజ్‌ సూద్‌ పేరుతో స్కాలర్‌షిప్‌ని అందించేందుకు శ్రీకారం చుట్టారు. అర్హులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ ద్వారా నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.

Updated Date - Dec 26 , 2024 | 04:43 PM