Sonali Bendre: ఆ పనికిమాలిన ట్రెండ్ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది
ABN , Publish Date - May 03 , 2024 | 02:37 PM
పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు సోనాలి బింద్రే. ఆ తర్వాత కొన్నాళ్లకు క్యాన్సర్ బారిన పడడంతో మరికొంత గ్యాప్ వచ్చింది. క్యాన్సర్ నుంచి కోలుకుని తాజాగా సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారామె.
పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు సోనాలి బింద్రే (Sonali bindre). ఆ తర్వాత కొన్నాళ్లకు క్యాన్సర్ బారిన పడడంతో మరికొంత గ్యాప్ వచ్చింది. క్యాన్సర్ నుంచి కోలుకుని తాజాగా సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారామె. ‘ది బ్రోకెన్ న్యూస్’ (The Broken News) సీజన్2తో ఆకట్టుకున్నారు. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా ఆమె మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 90ల్లో సినిమా పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. అప్పటి నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘1994లో నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. ఇప్పటితో కంపేర్ చేస్తే అప్పటి పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉండేవి. ఎంతోమంది సహనటులతో నాపై రూమర్స్ సృష్టించారు. వాటిలో ఒక్కటి కూడా నిజం లేదు. ఇప్పటికీ ఈ పనికిమాలిన ట్రెండ్ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది. 90ల్లో సినిమా నిర్మాతలే హీరో-హీరోయిన్ల మధ్య ఇలాంటి గాసిప్స్ క్రియేట్ చేేసవారు. వాటిని మీడియా వాళ్లకు చెప్పేవాళ్లు (Sonali Comments on producers). వాళ్ల సినిమాల ప్రమోషన్స్ కోసమే ఇలా చేసేవారు. అది తెలిశాక నేను ఆశ్చర్యపోయాను’ అని అన్నారు. అంతే కాదు అప్పట్లో కూడా బాడీ షేమింగ్ చేసేవారని ఆమె అన్నారు. హీరోయినగా కెరీర్ బిగిన చేసిన సమయంలో నేను సన్నగా ఉన్నందుకు అందరూ హేళన చేసేవారు. అప్పట్లో చాలామంది హీరోయిన్లు కొంచెం బొద్దుగా ఉండేవారు. వాళ్లతో పోలిస్తే నేను సన్నగా ఉండేదాన్ని. కొందరు నిర్మాతలు ఈ విషయాన్ని నా మొహం మీదే చెప్పేవారు. వాటిని నేనేం పట్టించుకోలేదు. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. నటనలో, డ్యాన్స్‌లో ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. ఇక్కడకు వచ్చాకే అన్ని నేర్చుకున్నా. స్టార్‌గా హీరోయిన్గా కొనసాగుతానని కూడా అనుకోలేదు. నాకు వచ్చిన అవకాశాలు, ఆదరించిన ప్రేక్షకుల వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నా’’ అని సోనాలి బింద్రే అన్నారు.
Jitender Reddy: 1980’s నిజంగా జరిగిన రాజకీయాల నేపథ్యంలో ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్‌కు అనూహ్య స్పందన
Read More: Tollywood, Cinema News