Shruti Haasan: నెటిజన్‌పై శ్రుతీహాసన్ ఫైర్.. కారణం ఏంటంటే!
ABN , Publish Date - Jun 21 , 2024 | 08:50 PM
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే శ్రుతీహాసన్ (Shruti Haasan)కు నెటిజన్ల నుంచి చిరాకు కలిగించే ప్రశ్నలు తరచూ ఎదురవుతుంటాయి. దాంతో ఆమె అసహనానికి గురవుతుంటుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే శ్రుతీహాసన్ (Shruti Haasan)కు నెటిజన్ల నుంచి చిరాకు కలిగించే ప్రశ్నలు తరచూ ఎదురవుతుంటాయి. దాంతో ఆమె అసహనానికి గురవుతుంటుంది. తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నపై నటి శ్రుతి హాసన్ మండిపడ్డారు. ‘మాలా ఉండేందుకు ప్రయత్నించకండి?’ అంటూ సదరు వ్యక్తికి గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ‘సౌత్ ఇండియన్ (South indians) యాసలో ఏదైనా చెప్పండి?’ అంటూ సదరు నెటిజన్ అడగగా ఆమె స్పందించారు. ‘‘ఓకే.. ఇలాంటి వివక్షలే వద్దు. మీరు మమ్మల్ని చూసి ఇడ్లీ, సాంబార్ అని అనడం సరైంది కాదు. మీరు మమ్మల్ని అనుకరించలేరు. మాలాగా ఉండేందుకు ప్రయత్నించొద్దు’’ అని అన్నారు. బాలీవుడ్ నటులు(Bollywood Stars comments).. దక్షిణాది నటులను చిన్నచూపు చూస్తుంటారని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమె ఇలా సమాధానం ఇచ్చారేమోనని పలువురు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పలు వెబ్‌సైట్స్ ఇదే కోణంలో వార్తలు రాశాయి. కొన్ని నెలల క్రితం జరిగిన అనంత అంబానీ పెళ్లి వేడుకలో షారుక్‌ఖాన రామ్‌చరణ్‌ను ఉద్దేశించి సరదాగా ఇడ్లీ, సాంబర్ అనడంపై పెద్ద చర్చే జరిగింది. ఆ విషయాన్ని గుర్తు చేసుకుని శ్రుతీ ఇలా స్పందించిందని, తన అసహనానికి అదే కారణమని కామెంట్స్ చేస్తున్నారు.
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రిలేషన్ గురించి కూడా చెప్పింది శ్రుతీ. ‘మీరు సింగిలా.. రిలేషన్‌లో ఉన్నారా?’ అని నెటిజన్ అడిగిన ప్రశ్నకు తనకు ఆ తరహా ప్రశ్నలు నచ్చవంటూనే సింగిలే అని క్లారిటీ ఇచ్చారు. రిలేషన్ కోసం ఎదురుచూస్తున్నానని తెలిపింది. ప్రస్తుతం తెలుగులో ‘డకాయిట్ (Dacoit)’, ‘చెన్నై స్టోరీ’ల్లో నటిస్తున్నారు. ‘సలార్’ సీక్వెల్ ‘సలార్ 2’ (Salaar2)లోనూ ఆమె నటించనుంది.