Shraddha Srinath: మహిళలపై వేధింపులు.. శ్రద్ధా శ్రీనాథ్‌ ఏమన్నారంటే..

ABN , Publish Date - Sep 14 , 2024 | 03:57 PM

సినీ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలనూ హీరోయిన్‌ శ్రద్ధా శ్రీనాథ్‌ (Shraddha Srinath) స్పందించారు. మహిళలపై వేధింపులు ఆగాలంటే పటిష్ఠమైన సంస్థలు రావాలని ఆమె అన్నారు.

సినీ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలనూ హీరోయిన్‌ శ్రద్ధా శ్రీనాథ్‌ (Shraddha Srinath) స్పందించారు. మహిళలపై వేధింపులు ఆగాలంటే పటిష్ఠమైన సంస్థలు రావాలని ఆమె అన్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వూలో తన  సినిమా జర్నీ, హేమ కమిటీ నివేదిక గురించి మాట్లాడారు. ‘నేను మలయాళ (mollywood)చిత్ర పరిశ్రమలోనూ పనిచేశాను. కానీ, నేనెప్పుడూ  ఎలాంటి వేధింపులు ఎదుర్కొలేదు. చాలా సురక్షిత వాతావరణంలో పని చేశాను. పార్టీలకు వెళ్లి ఇంటికి వస్తున్నప్పుడు నా చుట్టూ ఏం జరుగుతుందో గమనించుకుంటూ ఉండేదాన్ని. డ్రైవర్‌ ఎటు చూస్తున్నాడో ఎప్పుడూ అప్రమత్తతతో వ్యవహరించేదాన్ని. ఎనిమిదేళ్ల వయసు నుంచే అలా జాగ్రత్తగా ఉండడం నేర్చుకున్నా. అందుకే నాకు ఎప్పుడూ పరిశ్రమలో వేధింపులు ఎదురుకాలేదు. ఈ విషయంలో నేను అదృష్టవంతురాలిని. సినిమా సెట్‌లో మహిళలకు సరైన పారిశుద్థ్య సౌకర్యాలు ఉండవు. అలాంటి కనీస అవసరాలు కచ్చితంగా ఉండేలా చూడాలి. హేమ కమిటీ రిపోర్ట్‌ చూసి షాకయ్యాను. సమస్యలను ఎదుర్కొంటున్న మహిళలు వాటిని ఎవరితో చర్చించాలో తెలియక సతమతమవుతున్నారు. కష్టాన్ని మనసులోనే దాచుకుంటున్నారు. పరిశ్రమలో మహిళలపై ఈ తరహా వేధింపులు ఆగాలంటే పటిష్ఠంగా పనిచేసే సంస్థలు రావాలి’ అని శ్రద్థ అన్నారు. 

గత కొద్దిరోజులుగా మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జస్టిస్‌ హేమ కమిటీ (Hema Committee Report) సిద్థం చేసిన రిపోర్ట్‌ తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ రిపోర్ట్‌ను ఉద్దేశించి ఇప్పటికే పలువురు నటీనటులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అన్ని ఇండస్ట్రీలో ఇలాంటి ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కొందరు నటీనటులు  కోరుతున్నారు. ఇప్పటికే తమిళ ఇండస్ట్రీలో ఓ కమిటీ వేశారు.

Updated Date - Sep 14 , 2024 | 03:57 PM