Shraddha Das: వ్యాపారవేత్తతో పీకల్లోతు ప్రేమలో...?
ABN , Publish Date - Jan 07 , 2024 | 12:40 PM
సిద్ధూ ఫ్రమ్ సీకాకుళం, డార్లింగ్, ఆర్య-2 చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు శ్రద్ధాదాస్(Shraddha Das). తెలుగు సినిమాలతో కెరీర్ మొదలుపెట్టిన ఆమె హిందీ, కన్నడ సినిమాల్లో కూడా మెరిశారు. ప్రస్తుతం ఆడపాదడపా చిత్రాల్లో కనిపిస్తున్నారు.
సిద్ధూ ఫ్రమ్ సీకాకుళం, డార్లింగ్, ఆర్య-2 చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు శ్రద్ధాదాస్(Shraddha Das). తెలుగు సినిమాలతో కెరీర్ మొదలుపెట్టిన ఆమె హిందీ, కన్నడ సినిమాల్లో కూడా మెరిశారు. ప్రస్తుతం ఆడపాదడపా చిత్రాల్లో కనిపిస్తున్నారు. పూర్తి స్థాయి హీరోయిన్ గా ఆమెకు అవకాశాలు లేవు. దాంతో పలు టీవీ షోల్లో న్యాయనిర్ణేతగా, సినిమాల్లో గెస్ట్‌గా కనిపిస్తున్నారు. సినిమాలకు కాస్త దూరంగా ఉన్నా.. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో అయితే టచ్ లోనే ఉంటుంది. ఇటీవల కేరళలో ట్రిప్ వేసిన ఆమె అక్కడ చిల్ అవుతూ ఫోటోలు, వీడియోలు పంచుకుంది. అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గడం లేదు.
తాజాగా ఈమెకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. త్వరలోనే ఆమె పెళ్లి కూతురు కాబోతుందట. ఓ బిజినెస్‌మెన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాదు ఈ ఏడాదిలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే గత రెండు రోజులుగా ఈ వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. కానీ దీనిపై శ్రద్ధా ఎక్కడా స్పందించలేదు. మరి ప్రేమ, పెళ్లి విషయంలో ఎంత నిజం ఉందో తెలియాలంటే శ్రద్ధా పెదవి విప్పాల్సిందే!