Biggboss 3 Ott: షో నిషేదించాలంటూ ఫిర్యాదు!

ABN , Publish Date - Jul 23 , 2024 | 03:18 PM

హిందీలో బిగ్‌బాస్‌ ఓటీటీ సీజన్‌ 3 నడుస్తోంది. అనిల్‌ కపూర్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఈ షో రెండు వారాలు పూర్తి చేసుకుంది. టాస్కులు, వివాదాలు రొమాంటిక్‌ సీన్స్‌.. కారణంగా ఓటీటీ సీజన్‌ 3 హాట్‌ టాపిక్‌గా మారింది.

హిందీలో బిగ్‌బాస్‌ ఓటీటీ సీజన్‌ 3 (Biggboss 3 OTT) నడుస్తోంది. అనిల్‌ కపూర్‌ (Anil kapoor) హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఈ షో రెండు వారాలు పూర్తి చేసుకుంది. టాస్కులు, వివాదాలు రొమాంటిక్‌ సీన్స్‌.. కారణంగా ఓటీటీ సీజన్‌ 3 హాట్‌ టాపిక్‌గా మారింది. కుటుంబ ప్రేక్షకులు అంతా చూసే షో అని పబ్లిసిటీ చేసి రొమాంటిక్‌ సీన్స్‌ చూపిస్తున్నారని షోపై విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ షోను ఆపండని ఫిర్యాదు చేశారు. తాజాగా ప్రసారమైన ఎపిసోడ్‌లో అభ్యంతరకర సన్నివేశాలున్నాయని, బిగ్‌బాస్‌ షోను నిషేధించాలని శివసేన షిండే వర్గానికి చెందిన ప్రతినిధి మనీషా కయాండే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు విషయంలోకి వెళ్తే.. ‘జులై 18న ప్రసారమైన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్‌ అర్మాన్‌ మాలిక్‌ (Armaan Malik) , కృతికా మాలిక్‌ (Krithka malik) జోడి బెడ్‌రూమ్‌లో శ్రుతిమించి ప్రవర్తించారు. ఇద్దరు హద్దులు మీరారు. పిల్లలు కూడా ఈ షో చూస్తారు. ఇలాంటి అభ్యంతరకర సీన్లు వారిపై ప్రభావం చూపిస్తాయి. బిగ్‌బాస్‌ షోను వెంటనే నిలిపివేయాలి. సైబర్‌ క్రైమ్‌ చట్టాల కింద కేసు నమోదు చేయాలి. బిగ్‌బాస్‌ ఫ్యామిలీ షో కాదు. ఈ షోను నిషేధించేలా చర్యలు తీసుకోవాలి’ అని నగర పోలీస్‌ కమిషనర్‌కు రాసిన లేఖలో మనీషా కయాండే పేర్కొన్నారు. ఓటీటీ సీజన్‌ 3లో అర్మాన్‌ మాలిక్‌ హైలెట్‌గా నిలిచాడు.  తనకు ఇద్దరు భార్యలు ఉండడమే ఇందుకు కారణం. ఇటీవలి ఎపిసోడ్‌లో అర్మాన్‌, అతని రెండవ భార్య కృతికకు సంబదించిన ఓ ప్రైవేట్‌ వీడియో నెట్టింట వైరల్‌ అయ్యింది. లైవ్‌ షోలో సన్నిహితంగా ఉండటంపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియోపై అర్మాన్‌ మొదటి భార్య పాయల్‌ స్పందిస్తూ.. అర్మాన్‌, కృతికల వీడియోను ఎవరో ఎడిట్‌ చేశారన్నారు. వీడియో క్లిప్‌లో కనిపించే లైట్స్‌, దుప్పటి షోలో ఉన్నవి కాదన్నారు.  

దీనిపై జియో సినిమా వివరణ ఇచ్చింది.‘మేము ప్రసారం చేసే కంటెంట్‌ ఏదైనా.. నాణ్యత, మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటుంది. జియో సినిమాలో ప్రసారమయ్యే ఓటీటీ బిగ్‌బాస్‌లో అలాంటి అశ్లీల కంటెంట్‌ లేదు. ప్రస్తుతం వైరల్  అవుతోన్న   వల్గర్  వీడియో క్లిప్‌ ఫేక్‌. అది చూసి మాకు కూడా తీవ్ర ఆందోళన కలిగింది. దీని వెనక ఎవరున్నారో త్వరలోనే కనుక్కుంటాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’ అని జియో సినిమా  తెలియజేసింది.

Updated Date - Jul 23 , 2024 | 04:08 PM