Shah rukh Khan: షారుక్‌ఖాన్‌ చెప్పిన గుడ్‌ న్యూస్‌ ఏంటంటే..

ABN , Publish Date - Nov 03 , 2024 | 09:27 PM

బాలీవుడ్‌ బాద్‌షా Shah rukh khan తన కుటుంబానికి, అభిమానులు శుభవార్త చెప్పారు. శనివారం ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సిగిరెట్లు కాల్చడం మానేస్తానని మాటిచ్చారు


బాలీవుడ్‌ బాద్‌షా Shah rukh khan తన కుటుంబానికి, అభిమానులు శుభవార్త చెప్పారు. శనివారం ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సిగిరెట్లు కాల్చడం మానేస్తానని మాటిచ్చారు. ఆయన సిగరెట్‌కు బానిస అనే విషయం తెలిసిందే! రోజుకు ఒకటీ రెండు ప్యాకెట్లు కాదు ఏకంగా వంద వరకు సిగరెట్లు కాల్చేవారు. అస్తమానూ సిగరెట్లు తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎలా? అని  కుటుంబం సభ్యులు, అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేసేవారు. ఈ వ్యసనానికి దూరం కావాలని షారూఖ్‌ ఎన్నోసార్లు ప్రయత్నం చేశానని చెప్పారు. కానీ కాలేదు. పైనల్‌గా ఇప్పుడు దానిపై విజయం సాధించానని చెబుతున్నారు. నవంబర్‌ 2న బర్త్‌డే జరుపుకున్న ఆయన ఫ్యాన్స్‌తో మీట్‌ అండ్‌ గ్రీట్‌ ఈవెంట్‌ ఏర్పాటు చేశారు. ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ ‘మీకో మంచి విషయం చెప్పబోతున్నాను. నేను సిగరెట్లు తాగడం ఆపేశాను. కానీ దమ్ము లాగడం ఆపేశాక కూడా శ్వాససమస్యలు తగ్గలేదు.

ఇప్పటికీ కొన్నిసార్లు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూనే ఉన్నాను. దేవుడి దయ వల్ల త్వరలోనే ఈ ఇబ్బంది కూడా పోయి అంతా బాగుంటుందని ఆశిస్తున్నాను’ అన్నాడు. షారూఖ్‌ నోటి నుంచి ఈ మాటలు వినగానే ఫ్యాన్స్‌ సంతోషంతో చప్పట్లు కొట్టారు. తాను రోజుకు వంద సిగరెట్లు తాగిన విషయాన్ని కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తిండి, నీళ్లు అన్నీ మానేసి కేవలం దమ్ము కొడుతూ కూర్చునేవాడిని. 30 కప్పుల బ్లాక్‌ కాఫీ తాగిసిక్స్‌ ప్యాక్‌ మెయింటెన్‌ చేశాను’’ అన్నారు. అప్పట్లో ఈ కామెంట్లు తెగ వైరలయ్యాయి.  ప్రస్తుతం షారుక్‌ కింగ్‌ అనే సినిమా చేస్తున్నాడు. సుజోయ్‌ ఘోష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అభిషేక్‌ బచ్చన్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు.

Updated Date - Nov 03 , 2024 | 09:27 PM