Sara Ali Khan: డైరెక్ట్‌గా ఓటీటీలోకి.. సారా అలీఖాన్ పేట్రియాటిక్ చిత్రం
ABN , Publish Date - Feb 13 , 2024 | 05:34 PM
బాలీవుడ్ ఆగ్ర నటుడు సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ తాజాగా నటించిన చిత్రం ఏ వతన్ మేరే వతన్. భారత స్వాతంత్య్ర ఉద్యమ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో మేకర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
బాలీవుడ్ ఆగ్ర నటుడు సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ (Sara Ali khan) తాజాగా నటించిన చిత్రం ఏ వతన్ మేరే వతన్ (Ae Watan Mere Watan). భారత స్వాతంత్య్ర ఉద్యమ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ఇమ్రాన్‌హస్మి (Emraan Hashmi), సచిన్ ఖేడ్కర్ వంటి నటులు ప్రధాన పాత్రలు పోషించగా బాలీవుడ్ ఆగ్ర నిర్మాత కరణ్ జోహార్ నిర్మించారు.
గతంలో ఎక్ తి దయాన్ చిత్రానికి దర్శకత్వం వహించిన కణ్ణన్ అయ్యర్ (Kannan Iyer) దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో మేకర్స్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చిత్రాన్ని థియేటర్లలో కాకుండా డైరెక్ట్ ఓటీటీలోనే స్ట్రీమింగ్‌కు తీసుకువస్తున్నట్లు ప్రకటించారు.
స్వాతంత్రోద్యమ సమయంలో చాలామంది అనేక రకాలుగా బ్రిటీష్ వారిపై తిరుగుబాట్లు, పోరాటాలు చేశారు. ఇంకా కొంతమంది బయటకు కనబడకుండా కూడా ఇతోధికంగా ఉద్యమంలో పాలు పంచుకున్నారు. వీటిలో చాలా మందిప్రాణాలకు తెగించి చేసిన పోరాటాలు వెలుగులోకి రాలేదు.. సరిగ్గా అ కోవకే చెందిన ఓ రియల్ లైఫ్ స్ట్రగుల్ ఇన్సిడెంట్‌తో ఈ ఏ వతన్ మేరే వతన్ (Ae Watan Mere Watan) చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం.
స్వాతంత్రోద్యమం ఉవ్వెత్తున్న ఎగిసి పడుతున్న సమయంలో గుజరాత్‌కు చెందిన గాంధేయవాది ఉషా మెహతా (Usha Mehta) 1942లో కింతమంది తన మద్దతుదారులతో కలిసి రహస్యంగా ఓ రేడియోను స్థాపించి నాడు ఉదయ్మంలో పాల్గొనే వారిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ క్రమంలో బ్రిటీష్ వారి ఆగ్రహానికి గురై పలుమార్లు జైలుకు వెళ్లింది. ఇప్పుడు ఆమె కథనే స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమాను నిర్మించారు. ఇప్పుడు ఈ సినిమాను ప్రముఖ డిజిటల్ ఫ్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో మార్చి 21 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్, అమెజాన్ (Amazon Prime) అధికారికంగా ప్రకటించింది.