Samantha: ఆ జ్ఞాపకాలు.. అనుభవాలు గుర్తొస్తాయి.. అందుకే..

ABN , Publish Date - Nov 26 , 2024 | 10:33 AM

తన మాజీ భర్త నాగచైతన్యకు (Naga Chaitanya) ఇచ్చిన ఖరీదైన బహుమతులు వృధా అయ్యాయని సంచలన కామెంట్స్‌ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది సమంత.

తన మాజీ భర్త నాగచైతన్యకు (Naga Chaitanya) ఇచ్చిన ఖరీదైన బహుమతులు వృధా అయ్యాయని సంచలన కామెంట్స్‌ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది సమంత. సిటాడెల్‌ (Citadel) సిరీస్‌ ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్‌ ధావన్‌ (varun Dhavan) అడిగిన ఓ ప్రశ్నకు ఆమె ఇలా సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్‌ కాగా నెటిజన్లు ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు. ఇప్పటిదాకా సంయమనంగా ఉండి, మూడేళ్ల తర్వాత సమంత ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని కామెంట్స్‌ చేస్తున్నారు. తాజాగా ఆమె నటించిన సిటాడెల్‌ విషయానికొస్తే.. ఈ సిరీస్‌ను చూడలేకపోతున్నానని అంటోంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకూ ‘సిటాడెల్‌’ను పూర్తిగా చూడలేదు. ఎందుకంటే నేను అనారోగ్యంతోనే ఈ సిరీస్‌ చిత్రీకరణలో పాల్గొన్నా. సెట్‌లో నాకు ఎన్నో కష్టతరమైన రోజులు గడిచాయి. శారీరకంగా, మానసికంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా. ఇప్పుడీ సిరీస్‌ చూస్తే ఇది నన్ను ఆ జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లి ఆ అన్ఘుభవాలన్నింటినీ మళ్లీ మళ్లీ గుర్తుచేస్తుంది. ఇది నాకు బాధాకరంగా, కష్టంగా ఉంటుంది. అందుకే ఇప్పటి వరకూ కేవలం మొదటి ఎపిసోడ్‌ మాత్రమే చూశాను. రెండో ఎపిసోడ్‌ నుంచి చూడలేకపోతున్నాను’’ అని చెప్పుకొచ్చింది.  ఇటీవల ‘సిటాడెల్‌:హనీ బన్నీ’ వెబ్‌సిరీస్‌తో ఓటీటీ వేదికగా సందడి చేసింది సమంత. రాజ్‌ అండ్‌ డీకే రూపొందించిన ఈ సిరీస్‌తో తనలోని యాక్షన్‌ కోణాన్ని ప్రేక్షకులకు రుచి చూపించింది సామ్‌. ప్రస్తుతం తన సొంత బ్యానర్‌ ట్రాలాలా పతాకంపై ‘మా ఇంటి బంగారం’గా త్వరలో తెరపైకి రాబోతుంది. అది కాకుండా సమంత జాబితాలో ‘రక్త్‌బ్రహ్మాండ్‌’ అనే వెబ్‌సిరీస్‌ ఉంది. 

Updated Date - Nov 26 , 2024 | 10:33 AM