Samantha: నన్ను నేను నిర్వచించుకోవల్సి వస్తే..

ABN , Publish Date - Jul 20 , 2024 | 11:12 AM

"సినిమా ఇండస్ట్రీలో ఇన్నేళ్లగా ఉన్నా ప్రతి రోజు, ప్రతి పాత్ర కొత్తగానే ఉంటుంది. అయితే ఈ రంగంలో చేయాల్సింది, తెలుసుకోవల్సింది చాలా ఉందని నా భావన. సినిమాల్లో ఉన్న మ్యాజిక్కే అది’’ అని అంటోంది సమంత

"సినిమా ఇండస్ట్రీలో ఇన్నేళ్లగా ఉన్నా ప్రతి రోజు, ప్రతి పాత్ర కొత్తగానే ఉంటుంది. అయితే ఈ రంగంలో చేయాల్సింది, తెలుసుకోవల్సింది చాలా ఉందని నా భావన. సినిమాల్లో ఉన్న మ్యాజిక్కే అది’’ అని అంటోంది సమంత(Samantha). మయోసైటీస్‌ వ్యాధితో కొంతకాలంగా సినిమాలకు విరామం ఇచ్చిన ఆమె మళ్లీ సినిమాలతో బిజీ కానుంది. ప్రస్తుతం తన సొంత బ్యానర్‌ ట్రాలాలా సంస్థలో 'మా ఇంటి బంగారం’ చిత్రాన్ని ప్రకటించింది. అందులో ఆమె కథానాయిక. అలాగే బాలీవుడ్‌లో 'సిటాడెల్‌'(Citadel) సిరీస్‌ విడుదలకు సిద్ధమైంది. అలాగే సినిమా సిరీస్‌ చేయడానికి సిద్ధమైంది. తాజాగా ఆమె మాట్లాడుతూ ''నేనెప్పుడూ కొత్త విషయాల్ని తెలుసుకోవాలనుకుంటా. ప్రతీదీ నేర్చుకోవాలనే కోరుకుంటా.  నేనెప్పటికీ ఒక విద్యార్థినే. వచ్చే నెల నుంచి నా కొత్త సినిమా చిత్రీకరణను మొదలుపెట్టబోతున్నా. దాని కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అందులోని పాత్ర కోసం ప్రత్యేకంగా సిద్థమవుతున్నా.

Sam.jpg

నా తదుపరి ప్రాజెక్టులో నాలోని నటనా నైపుణ్యాల్ని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయని అనుకుంటున్నా. కొత్తగా మార్షల్‌ ఆర్ట్స్‌, ఆర్చరీ, గుర్రపు స్వారీ, కత్తిసాము లాంటి విలువిద్యల్లో శిక్షణ తీసుకుంటున్నా. ప్రతి విషయాన్ని నేర్చుకుంటున్నా. తెలియని విషయాల్ని తెలుసుకుంటున్నా. నన్ను నేను నిర్వచించుకోవల్సి వస్తే .మొదట నేను ఒక విద్యార్థిని అనే అంటాను. ఎన్ని సినిమాలు చేసినా, చేయబోయే పాత్రలు మనకెంతో నేర్పిస్తాయి.  ప్రతి స్ర్కిప్ట్‌తో విభిన్న పాత్రలోకి, వింత ప్రపంచంలోకి అడుగుపెట్టేలా చేస్తాయి’’ అని సామ్‌ చెప్పారు. 

Updated Date - Jul 20 , 2024 | 11:12 AM