Salman Khan: సరిగ్గా ప్రవర్తించడం తెలుసుకో.. సల్మాన్ ఖాన్ తండ్రికి మహిళ బెదిరింపులు
ABN , Publish Date - Sep 19 , 2024 | 03:49 PM
బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. అయితే ఈ సారి సల్మాన్‌కు కాకుండా ఆయన తండ్రి ప్రముఖ రచయిత సలీంఖాన్‌కు సరిగ్గా ప్రవర్తించడం తెలుసుకో అంటూ ఓ మహిళ వార్నింగ్ ఇచ్చింది.
బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan)కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. అయితే ఈ సారి సల్మాన్‌కు కాకుండా ఆయన తండ్రి ప్రముఖ రచయిత సలీంఖాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. సల్మాన్ తండ్రి సలీం ఖాన్ గురువారం (ఈ రోజు) ఉదయం వాకింగ్ చేద్దామని బయటికి రాగా అప్పటికే ఎదురుచూస్తున్న ఒక వ్యక్తి, బురఖా ధరించిన మహిళ స్కూటర్‌పై అతని వద్దకు వచ్చి, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరును ఉటంకిస్తూ బెదిరింపులు జారీ చేశారు. సరిగ్గా ప్రవర్తించడం తెలుసుకో.. లేదంటే లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi )ని పంపిస్తా’ అంటూ బెదిరించింది.
అయితే.. సల్మాన్(Salman Khan)ను బెదిరించే అగంతకులు ఫస్ట్ టైం ఓ గుర్తుతెలియని మహిళ ద్వారా సలీం ఖాన్‌ను బెదిరించడం ఇప్పుడు ప్రాముఖ్యం సంతరించుకుంది. బెదిరింపు రావడం ఇదే తొలిసారి. కాగా విషయం తెలుసుకున్న సల్మాన్ ఖాన్ వెంటనే పోలీసులకు సమాచారం అందించగా బాంద్రా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆ బురఖా ధరించిన మహిళ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యురాలా? అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఈ నేపథ్యలో ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా సల్మాన్ ఈ ఉదయం సినిమా షూటింగ్, ప్రైవేట్ కార్యక్రమాల నిమిత్తం వీదేశాలకు వెళ్లారు.