Raveena Tandon: ఆ కారణంతో రిజెక్ట్‌ చేసి.. షారుక్‌ షాకయ్యేలా చేసి..!

ABN , Publish Date - Aug 10 , 2024 | 06:44 PM

ఓ కారణంగా షారుక్‌ఖాన్ తో  సినిమాను తిరస్కరించానని చెప్పారు రవీనా టాండన్. అందులో .పాత్ర ఎంతో నచ్చినప్పటికీ కాదనుకున్నా అని ఆమె తాజా ఇంటర్వ్యూలో తెలిపారు


ఓ కారణంగా షారుక్‌ఖాన్ తో (Shahrukh Khan) సినిమాను తిరస్కరించానని చెప్పారు రవీనా టాండన్(Raveena tondon). అందులో .పాత్ర ఎంతో నచ్చినప్పటికీ కాదనుకున్నా అని ఆమె తాజా ఇంటర్వ్యూలో తెలిపారు.  షారుక్‌ఖాన్, రవీనా టాండన్ కలిసి 'యే లమ్హే జుదాయి కే’, ‘జాదు’, ‘జమానా దివానా’ వంటి చిత్రాలతో  అలరించారు. వీరిద్దరి కాంబోలో మరో సినిమాకు రంగం సిద్థమైనప్పటికీ.. దానిని  రిజక్ట్‌ చేశారు రవీనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.

‘‘షారుక్‌ ఖాన్‌ హీరోగా నటించిన ఓ చిత్రానికి తొలుత నన్నే కథానాయికగా అడిగారు. కథ, అందులో నా పాత్ర నాకెంతో నచ్చాయి. సినిమాకు సంతకం చేసే సమయంలో కాస్ట్యూమ్స్‌ గురించి చర్చించారు. చిత్రబృందం నేను ధరించాల్సిన దుస్తుల గురించి చెప్పినప్పుడు షాకయ్యా. చాలా ఇబ్బందిగా అనిపించింది. నాకు సౌకర్యవంతంగా అనిపించలేదు. చిన్న విషయమైనప్పటికీ ఆ ప్రాజెక్ట్‌కు నేను నో చెప్పా.

Tondon.jpg

ఆ తరహా దుస్తులు ధరించి యాక్ట్‌ చేయలేనని చెప్పాను. ఈ విషయం తెలిసి షాక్‌ అయ్యారు. ‘నీకు ఏమైనా పిచ్చిపట్టిందా? నో చెప్పాల్సిన అవసరం ఏముంది?’ అని ప్రశ్నించారు. మనం మరెన్నో చిత్రాలతో ప్రేక్షకులను అలరించాలి కదా అన్నారు. కాస్ట్యూమ్స్‌ వల్ల నేను చేయలేకపోతున్నానని అన్నాను. దానిని ఆయన అర్థం చేసుకున్నారు’’ అని రవీనాటాండన్‌ తెలిపారు. ప్రస్తుతం ఆమె సహాయనటిగా యాక్ట్‌ చేస్తున్నారు. 2022లో విడుదలైన ‘కేజీయఫ్‌ 2’ చిత్రంలో రమికాసేన్  పాత్రలో   మెప్పించారు. ప్రస్తుతం ఆమె ‘వెల్‌కమ్‌ టు ది జంగిల్‌’లో యాక్ట్‌ చేస్తున్నారు. 

Updated Date - Aug 10 , 2024 | 06:44 PM