Rakul Preet Singh: అలా ఉండేలా చూస్తాడు.. చేస్తాడు!
ABN , Publish Date - Mar 09 , 2024 | 12:29 PM
పెళ్లి అనంతరం తొలిసారి తన భర్త జాకీ భగ్నానీ గురించి మాట్లాడారు రకుల్ ప్రీత్ సింగ్. అస్సాం వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జాకీ తనకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువని చెప్పగా, రకుల్ అది నిజమేనన్నారు.
పెళ్లి అనంతరం తొలిసారి తన భర్త జాకీ భగ్నానీ (Jackky Bhagnani) గురించి మాట్లాడారు రకుల్ ప్రీత్ సింగ్9Rakul preet singh). అస్సాం వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జాకీ తనకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువని చెప్పగా, రకుల్ అది నిజమేనన్నారు. భర్తపై పొగడ్తలతో వర్షం కురిపించారు. ‘‘జాకీ మంచి మనసు, హాస్య చతురత కలిగిన వ్యక్తి. అతడిలోని కామెడీ టైమింగే తొలుత నన్ను ఆకర్షించింది. తను ఎప్పుడూ సరదాగా ఉంటాడు. చుట్టూ ఉన్నవాళ్లు సంతోషంగా ఉండాలనుకుంటారు. ఆనందంగా ఉండేలా చూస్తాడు’’ అని ఆమె అన్నారు.
కన్నడ సినిమా 'గిల్లీ’తో తెరంగేట్రం చేసిన రకుల్ హిందీ పరిశ్రమలో ఇటీవల దశాబ్దకాలం పూర్తి చేసుకున్నారు. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సమయంలో కామన్ ఫ్రెండ్స్ వల్ల బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో పరిచయం ఏర్పడింది. గత మూడేళ్ల నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో ఈ ఏడాది ఫిబ్రవరి 21న గోవాలో వీరి పెళ్లి జరిగింది. వివాహం అనంతరం ఇటీవల టూర్‌కు వెళ్లారు. అక్కడ ప్రముఖ దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అస్సాం స్టేట్ ఫిల్మ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ జంట పాల్గొన్నారు